Muskmelon: సమ్మర్ లో విరివిగా దొరికే కర్భూజా గురించి ఈ నిజాలు తెలుసా?
ABN, Publish Date - Feb 25 , 2024 | 01:22 PM
వేసవికాలం మండే ఎండలనే కాదు.. చాలా రుచులను వెంటబెట్టుకొస్తుంది. వీటిలో కర్భూజ కూడా ఉంటుంది. దీని గురించి ఈ నిజాలు తెలిస్తే..
వేసవికాలం మండే ఎండలనే కాదు.. చాలా రుచులను వెంటబెట్టుకొస్తుంది. పుచ్చకాయలు, మామిడి, కర్భూజ, చెరకు రసం.. ఇలా చాలా నోరూరించే పండ్లు, పానీయాలకు వేసవిలో చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మస్క్ మిలన్ గా పిలుచుకునే కర్భూజను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలున్నాయని ఆహార నిపుణులు అంటున్నారు. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కర్భూజ పండు గురించి మీక తెలియని నిజాలు కొన్ని తెలుసుకుంటే..
పోషకాలు..
కర్భూజ పోషకాలకు పవర్ హౌస్. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్- బి కాంప్లెక్స్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-ఎ మెరుగైన కంటి ఆరోగ్యానికి, విటమిన్-కె ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది. ఇక బి-కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి శక్తిని అందించడంలోనూ, జీవక్రియను, నాడీవ్యవస్థను మెరుగ్గా ఉంచడంలోనూ సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి జీరో కేలరీల ఆహారాలివే..!
హైడ్రేట్..
కర్భూజలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచడానికి, జీవక్రియకు సహాయపడుతుంది. దీన్ని తింటే రిఫ్రెష్ ఫీల్ ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు..
బీటా కెరోటిన్, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు కర్భూజలో పుష్కంలగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
కంటి ఆరోగ్యం..
సీతాఫలంలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-ఎ గా రూపాంతరం చెందుతుంది. విటమిన్-ఎ రెటీనా పనితీరుకు అవసరం. కర్భూజాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం..
కర్బూజాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలను సులభం చేస్తుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గట్ మైక్రోబయోమ్ కు దోహదం చేస్తుంది.
ఇది కూడా చదవండి: జుట్టుకు రైస్ వాటర్ పెడితే కలిగే లాభాలివే..!
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2024 | 01:23 PM