ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Over-Hydration: కిడ్నీలకు మంచిదని నీళ్లు తెగ తాగేస్తున్నారా? దీంతో వచ్చే సమస్య ఏంటో తెలిస్తే!

ABN, First Publish Date - 2024-02-06T16:24:13+05:30

అతిగా నీరు తాగే వాళ్లల్లోనూ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: కిడ్నీల ఆరోగ్యానికి నీరు మంచిదన్న విషయం తెలిసిందే. కానీ, అదేపనిగా నీళ్లు తాగితే కూడా చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చాలా మందికి డీహైడ్రేషన్ గురించి తెలుసుగానీ ఓవర్ హైడ్రేషన్ (Over-Hydration) గురించి అంత అవగాహన ఉండదు. పరిమితికి మించి నీరు తాగితే ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా అథ్లెట్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఓవర్ హైడ్రేషన్ అరుదైన సమస్యే కానీ అథ్లెట్లు తన సామర్థ్యం పెంచుకునేందుకు కొన్ని సార్లు నీళ్లు ఎక్కువగా తాగుతారు. శరీరంలో నీరు తగినంత ఉంటే మరింత మెరుగ్గా క్రీడల్లో పాల్గొనచ్చనేది వారి నమ్మకం. ఈ క్రమంలో శరీరంలో నీరు ఎక్కువై (Overhydration) ఎలక్ట్రోలైట్ల (లవణాలు) స్థాయిల్లో మార్పులు వస్తాయి. ముందుగా సోడియం స్థాయి తగ్గిపోతుంది. దీంతో, ఆలోచనల్లో స్పష్టత లోపించినట్టు ఉండటం, వాంతులు, కండరాల బలహీనత, పట్టేసినట్టు ఉండటం, తలనొప్పి వంటివి తలెత్తుత్తాయి (Symptoms). అత్యంత అరుదైన సందర్భాల్లో.. మెంటల్ కన్‌ఫ్యూషన్, ఫిట్స్‌తో పాటూ కోమాలోకి కూడా వెళ్లొచ్చు.


ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు తాగే విషయంలోనూ నియంత్రణ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. దాహం వేస్తోందా? లేదా? మూత్రం మరీ లేత పసుపు రంగులోకి ఉందా అనే విషయాలను గమనిస్తుండాలి. సాధారణంగా గంటకు ఒక లీటరు మించి నీటిని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిమితికి లోబడి ఉంటే శరీరంలోని అదనపు నీటిని తొలగించేందుకు కిడ్నీలకు తగినంత సమయం దొరుకుతుంది. దీంతో, శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ ఆరోగ్యకర స్థాయిలో కొనసాగుతుంది.

ఇక ఓవర్ హైడ్రేషన్‌తో ఇన్‌ఫ్లమేషన్ తలెత్తిన సందర్భాల్లో పాటించాల్సిన కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. పసుపు, అల్లం, ఆకుకూరలు, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, టమాటాలు, విత్తనాలు, గింజలు, గ్రీన్ టీతో ఈ ఇన్‌ఫ్లమేషన్ సులభంగా తగ్గించుకోవచ్చు.

Updated Date - 2024-02-06T16:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising