Pimple Marks: మీ ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు ఉన్నాయా? ఇవి వాడి చూడండి..!
ABN, Publish Date - Sep 14 , 2024 | 02:15 PM
మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, ట్యాన్.. ఇలాంటివన్నీ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. ఈ మచ్చల కారణంగా ముఖంలో మెరుపు కోల్పోయినట్టు ఉంటుంది.
ముఖం అందంగా, క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే మచ్చలు, మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, ట్యాన్.. ఇలాంటివన్నీ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. ఈ మచ్చల కారణంగా ముఖంలో మెరుపు కోల్పోయినట్టు ఉంటుంది. ముఖం మీద మొటిమలను, మొటిమల తాలూకు మచ్చలను తగ్గించడానికి కొన్ని టిప్స్ చక్కగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..
మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!
తేనె..
చర్మానికి తేనెను అప్లై చేయడం వల్ల డార్క్ స్పాట్స్ ను తగ్గించుకోవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు తగ్గించడంలోనూ, మొటిమల తాలూకు మచ్చలు తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అలోవెరా..
అలోవెరా మొటిమలు, మచ్చల మీద మంచి ప్రభావం చూపిస్తుంది. మొటిమల మచ్చల మీద కలబంద గుజ్జును అప్లై చేసి 20,30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని కడిగేయాలి. దీన్ని రాత్రి సమయంలో ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచపచ్చు. మంచి ఫలితాలు ఇస్తుంది.
జుట్టు బాగా రాలుతోందా? అసలు కారణాలు ఇవే..!
రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 14 , 2024 | 02:15 PM