ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వానాకాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ABN, Publish Date - Jun 30 , 2024 | 08:46 PM

వానాకాలంలో రోగాలు దరిచేరకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలం వేడికి అల్లాడిపోయే జనాలకు స్వాంతన చేకూరుస్తూ వానాకాలం వచ్చేసింది. కొన్ని చోట్ల వర్షం బీభత్సానికి జనాలు అల్లాడిపోతున్నారు. అయితే, కాలం మారడంతో అనేక అనారోగ్యాలు కూడా వచ్చిపడతాయి. టైఫాయిడ్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, లెప్టోస్పైరోసిస్, జాండిస్, కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనేక రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఇవి దరిచేరకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు (Health) తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

వానాకాలంలో రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. ఆహారం, నీరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈకాలంలో దోమలు దరిచేరకుండా చూసుకోవాలి.

Health: స్త్రీపురుషులు వేర్వేరు సమయాల్లో ఎక్సర్‌సైజులు చేయాలా?

ఈకాలంలో స్ట్రీట్ ఫుడ్ ఎంత తక్కువగా తింటే అంత మంచిదని వైద్యులు చెబుతున్ారు. హానికారక బ్యాక్టీరియాతో కలుషితమయ్యే బ్యాక్టీరియా వల్ల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ల బారినపడతారు. పళ్లు, కూరగాయలు బాగా కడిగాకే తినాలి. వీలైనంత వరకూ కాచి చల్లార్చిన నీళ్లనే తాగాలి (Precautions to be taken to prevent from falling ill in rainy season).


ఇంటి ముందు నీరు నిలవకుండా చూసుకోవడం తప్పనిసరి. నీరు నిలిస్తే అందులో దోమలు బెడద ఎక్కువై డెంగీ మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో నిళ్లు నిలువ చేసే బిందెలపై కూడా ఎల్లప్పుడూ మూతలు పెట్టి ఉంచడం మంచిది.

వీలైనంత వరకూ వానలో తడవకుండా ఉంచడం మంచిది. వానలో తడిస్తే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.

వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండే ఊపిరి సంబంధిత సమస్యలు రావు.

Read Health and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 08:47 PM

Advertising
Advertising