ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

protein Facts: రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం? ప్రోటీన్ సప్లిమెంట్లను మొదట ఎవరికోసం తయారుచేశారో తెలుసా?

ABN, Publish Date - Jan 24 , 2024 | 05:34 PM

శరీరంలో కండర నిర్మాణం జరగాలన్నా, కండరాల పనితీరు బాగుండాలన్నా, దెబ్బ తిన్నకండరాలు తిరిగి కోలుకోవాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపిస్తే శరీరంలో పట్టు ఉండదు.

మనిషి శరీరానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. శరీరంలో కండర నిర్మాణం జరగాలన్నా, కండరాల పనితీరు బాగుండాలన్నా, దెబ్బ తిన్నకండరాలు తిరిగి కోలుకోవాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపిస్తే శరీరంలో పట్టు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రోటీన్ తీసుకోవాలి. మనిషి బరువులో ప్రతి కిలో బరువుకు 0.8గ్రాముల ప్రోటీన్ అవసరమని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ పేర్కొంది. అయితే ఆహార నాణ్యత, తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తగినంత లేకపోవడం తదితర అంశాల కారణంగా చాలామందిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు బ్రాండ్లు ప్రోటీన్ సప్లిమెంట్లను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక ఈ ప్రోటీన్ సప్లిమెంట్ల గురించి వివరంగా తెలుసుకుంటే..

నిజానికి ప్రోటీన్ సప్లిమెంట్లు అనేవి మొదట క్రీడాకారులు, బాడీబిల్డర్ల కోసం తయారుచేసినవి. వారి కండరాల సామర్థ్యం మెరుగ్గా ఉండాలనే కారణంగానూ, ఆటలలోనూ, వ్యాయామాల కారణంగా వారి కండరాలు బాగా అలసిపోతాయని వారి కోసం తయారుచేయబడినవే ప్రోటీన్ సప్లిమెంట్లు. అయినప్పటికీ ఇప్పుడు చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారు.

ఇది కూడా చదవండి: Clean Slating: డేటింగ్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్.. భారతీయులు ఎక్కువగా ఇదే ఫాలో అవుతున్నారట!



కొత్త రుచులు..

చాక్లెట్, వెనిల్లా, సాల్టెడ్ కారామెల్, బర్త్ డే కేక్ వంటి రుచులతో ప్రోటీన్స్ షేక్స్ ఇప్పట్లో మరింత రుచికరంగా మారాయి. ప్రోటీన్ బ్రాండ్లు కొత్త రుచుల రూపంలో ప్రోటీన్ షేక్స్ తయారీ మీద ఫోకస్ పెట్టినట్టు ప్రోటీన్ షేక్ బ్రాండ్ వ్యవస్థాపకుడు అర్జున్ పటేల్ అన్నారు.

విభిన్నంగా..

వెయ్ ప్రోటీన్ కు మించి ఇప్పట్లో ప్రోటీన్ బ్రాండ్లు విరివిగా వస్తున్నాయి. బియ్యం, బఠానీ, జనపనార, సోయా ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ల తయారీ విస్తృతంగా జరుగుతోంది. శాకాహరం తీసుకునే వారికి ఇవెంతో మంచి ఎంపిక అవుతున్నాయి.

అదనపు మూలాలు..

ప్రోటీన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులు మెరుగ్గా ఉండేందుకు కొల్లాజెన్, ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ప్రోటీన్ పౌడర్లు, షేక్స్ ను ప్రోటీన్ బ్రాండ్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో అదనపు ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి.

ప్రయాణాలకూ బెస్ట్..

ప్రోటీన్ బ్రాండ్లు ప్రజల వేగవంతమైన జీవనశైలికి తగ్గట్టు మార్పులు చెందాయి. రెడీ టు డ్రింక్ ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ బార్, ప్రోటీన్ ఇన్ప్యూజ్డ్ స్నాక్స్ బోలెడు అందుబాటులో తెచ్చాయి. ఇవి ప్రయాణాలలో కూడా తగినంత పోషకాలు తీసుకునేందుకు సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: Indian Dishes: ప్రపంచ 100 ఉత్తమ వంటకాలలో మనవీ ఓ నాలుగు.. ఘుమఘుమల జాబితాలోని భారత్ ఆహారాలివే..!



ఎంపిక..

ప్రోటీన్ బ్రాండ్లు, ప్రోటీన్ సప్లిమెంట్లు ఆరోగ్యానికి మేలు చేసే దృష్ట్యా రూపొందించబడినవే అయినా వీలైనంతవరకు తాజా ఆహారం నుండి ప్రోటీన్ పొందడానికి ప్రయత్నించడం మంచిది. సాధారణ జీవనశైలికి అందుబాటులో ఉన్న రోజువారీ ఆహారం నుండే ప్రోటీన్ పొందవచ్చు. ఇది సహజంగా శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటూ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటుంది.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 05:38 PM

Advertising
Advertising