ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: డబ్బున్నోళ్లకు కాన్సర్.. పేదోళ్లకు డయాబెటిస్.. మరో సంచలన అధ్యయనం

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:27 PM

స్థితిమంతులకు కాన్సర్ అవకాశాలు ఎక్కువని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. వీరిలో బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ క్యా్న్సర్లు ఎక్కువని ఫిన్‌లాండ్‌లో ఈ అధ్యయనం తేల్చింది.

ఇంటర్నెట్ డెస్క్: స్థితిమంతులకు కాన్సర్ అవకాశాలు ఎక్కువని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది (Health). వీరిలో బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ క్యా్న్సర్లు ఎక్కువని ఫిన్‌లాండ్‌లో ఈ అధ్యయనం తేల్చింది. పేద వారిలో కాన్సర్ ఎక్కువని కొంత కాలంగా ఉన్న నమ్మకాన్ని సవాలు చేసేలా ఉన్న ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి.

ఈ అధ్యయనం కోసం ఫిన్నిష్ జీనోమిక్ ప్రాజెక్టు నుంచి 2.80 లక్షల మందికి చెందిన జన్యుపరమైన, ఆరోగ్యపరమైన, సామాజిక ఆర్థికస్థితిగతులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. 35 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనంలో 19 రకాల వ్యాధులు వచ్చే అవకాశాన్ని అంచనా వేశారు. దీంతో, పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి (Rich people have greater genetic risk for cancer says study).

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


తక్కువ చదువు ఉన్న వారికి ఆర్థరైటిస్, లంగ్ క్యాన్సర్, డిప్రెషన్, మద్యం అలవాటు, డయాబెటిస్ టైప్ - 2 వంటివి వచ్చే జన్యుపరమైన అవకాశాలు ఎక్కువని ఈ అధ్యయనంలో తేలిసింది. అయితే, మంచి చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉన్న వారు బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ వంటి క్యాన్సర్ బారిన పడే అవకాశం పెరిగినట్టు తేలింది. దీనికి గల కరణాన్ని కూడా చెప్పుకొచ్చారు. స్థితిమంతులకు అవగాహన, వనరులు అందుబాటులో ఉండటంతో వారు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల జోలికి వెళ్లే అవకాశం తక్కువని ఫలితంగా వారి జీవితకాలం పెరిగి కాన్సర్ తలెత్తే అవకాశాలు పెరుగుతాయని ప్రధాన అధ్యయనకారుల్లో ఒకరు తెలిపారు. ఇక పేదల ఇలాంటి రిస్కీ ప్రవర్తనతో త్వరగా కన్నుమూస్తారని, దీంతో, వాళ్లల్లో కాన్సర్ బయటపడే అవకాశం తగ్గిపోతుందని అన్నారు.

కేవలం జీవనశైలి, ప్రకృతి సంబంధిత అంశాలే కాకుండా జన్యుపరమైన అంశాలను కూడా స్టడీ చేసినట్టు అధ్యయనకారులు తెలిపారు. అయితే, వృద్ధాప్యంలోనూ వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం కీలకమని వైద్యులు చెబుతున్నారు.

Read Health and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 07:40 PM

Advertising
Advertising
<