ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:15 PM

రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీంతో రెట్టింపు లాభాలు ఉండాలంటే రోజ్ వాటర్ ను ఎలా వాడాలి?

Rose Water

గులాబీల గురించి, గులాబీల అందం గురించి కవులు, రచయితలు రాయాల్సిందంతా రాసేశారు. అయినా సరే.. అమ్మాయి అందాన్ని పొగడాలి అంటే గులాబీ తో పోల్చడం చాలామందికి అలవాటు. గులాబీలను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. ఇక గులాబీలతో తయారు చేసే గులాబీ నీటికి అటు వంటకాలు, తీపి పదార్థాల తయారీలోనే కాకుండా సౌందర్య సాధనంగా కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. రోజ్ వాటర్ ను కింద చెప్పుకున్న విధంగా వాడితే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీంతో రెట్టింపు లాభాలు ఉండాలంటే రోజ్ వాటర్ ను ఎలా వాడాలి? తెలుసుకుంటే..


Banana: రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!



రోజ్ వాటర్ ప్రయోజనాలు..

  • రోజ్ వాటర్ వల్ల కలిగే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. అది చర్మాన్ని చల్ల బరుస్తుంది. చర్మం మీద మంటలు, చికాకులు తగ్గించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

  • రోజ్ వాటర్ ను రెగ్యులర్ గా వాడుతుంటే చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది.


Packet Milk: ప్యాకెట్ పాలు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?



డబుల్ బెనిఫిట్స్ కావాలంటే రోజ్ వాటర్ ఇలా వాడాలి..

  • రోజ్ వాటర్ ను క్లెన్సర్ లేదా టోనర్ గా ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వల్ల ఫలితాలు బాగుంటాయి.

  • ముఖం కడుక్కున్న తరువాత రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయాలి.

  • మందార ఐస్డ్ టీ తో రోజ్ వాటర్ ను తీసుకోవచ్చు.

  • రోజ్ వాటర్ ను మిస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం రోజ్ వాటర్ ను స్ప్రే బాటల్ లో వేయాలి. దీన్ని ముఖానికి స్ప్రే చేసుకోవాలి. కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో ముఖాన్ని తుడుచుకోవాలి. ముఖం మీద ఉన్న మృత కణాలు, దుమ్ము ధూళి, మురికి తొలగిపోతాయి.

  • పెర్ఫ్యూమ్ అంటే అంతగా ఇష్టపడని వారు రోజ్ వాటర్ ను మణికట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆహ్లాదకంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 04:15 PM

Advertising
Advertising