ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sapodilla: సపోటా పండ్లు ఎందుకు తినాలో చెప్పే 5 కారణాలు ఇవీ..!

ABN, Publish Date - Jan 18 , 2024 | 03:52 PM

సపోటాలు తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ , ఈ 5 కారణాలు తెలిస్తే వదిలిపెట్టరు.

సపోటా మధ్య అమెరికా, మెక్సికోకు చెందిన ఉష్ణమండల పండు. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. గోధుమ రంగుతో , తియ్యని రుచితో సపోటా చాలా మధురంగా ఉంటుంది. కొందరు సపోటాలు తినడానికి ఇష్టపడరు. అసలు సపోటా ఎందుకు తినాలో.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పే 5 కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

పోషకాల పవర్ హౌస్..

సపోటాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-ఎ కూడా మెండుగా ఉంటుంది. ఇది చర్మ సంరక్షణలోనూ, కంటిచూపు మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ, ఎముకలను బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!


ఫైబర్..

ఫైబర్ అత్యధికంగా ఉన్న పండ్లలో సపోటా ఒకటి. కేవలం ఒక్కపండులో 9గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఎక్కువసేపు ఉంచుతుంది. జీర్ణక్రియలోనూ, గట్ ఆరోగ్యంలోనూ సహాయపడుతుంది.

ఎనర్జీ బూస్టర్..

శరీరంలో సహజంగా శక్తిని పెంచడంలో సపోటా ది బెస్ట్. ఇందులో సహజ చక్కెరలు తక్షణ శక్తిని ఇస్తాయి. ఫ్రక్టోజ్, సుక్రోజ్ స్థిరంగా చక్కెరలను విడుదల చేస్తాయి. మధ్యాహ్న సమయంలో స్నాక్స్ గా సపోటాను తీసుకుంటే అలసటను తగ్గించి శరీరం శక్తి పుంజుకునేలా చేస్తుంది.

జీర్ణక్రియ..

సపోటాలో అధిక ఫైబర్ సహజ భేదిమందుగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకానికి చెక్ పెడుతుంది. ఇందులో టానిన్లు, ఫాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: RO Water: ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటరే తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!



గుండె ఆరోగ్యం..

సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్నితగ్గిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Iodised salt Vs Sea Salt: అయోడైజ్డ్ ఉప్పు మంచిదా? సముద్రపు ఉప్పు మంచిదా? ఏది వాడితే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 03:52 PM

Advertising
Advertising