ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Skin Care: చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

ABN, Publish Date - Jul 10 , 2024 | 01:39 PM

సీజన్ మారిన ప్రతిసారీ చర్మ సమస్యలు కూడా వస్తాయి. వేసవికాలంలో వేడి కారణంగా ఇబ్బందులు ఎదురైతే వర్షాకాలంలో వర్షం తేమ కారణంగా పొడి చర్మం సమస్య ఎదురవుతుంది. దీనికి కారణం చల్లని వాతావరణం వల్ల నీరు తక్కువగా తాగడం. అంతేకాకుండా

సీజన్ మారిన ప్రతిసారీ చర్మ సమస్యలు కూడా వస్తాయి. వేసవికాలంలో వేడి కారణంగా ఇబ్బందులు ఎదురైతే వర్షాకాలంలో వర్షం తేమ కారణంగా పొడి చర్మం సమస్య ఎదురవుతుంది. దీనికి కారణం చల్లని వాతావరణం వల్ల నీరు తక్కువగా తాగడం. అంతేకాకుండా చల్లని వాతావరణానికి చర్మం గురికావడం వ్లల చర్మం సున్నితంగా మారడం. వర్షాకాలంలో ఈ పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మానికి తేమను అందించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజూ స్నానం చేయగానే మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎక్కువకాలం చర్మం మృదువుగా ఉంటుంది.

Healthy Juices: ఈ జ్యూస్ లు తాగితే చాలు.. జుట్టు రాలడం మంత్రించినట్టు ఆగిపోతుంది..!



వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా చాలామంది బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. అయితే వేడిగా ఉన్న నీటికి బదులు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. గోరు వెచ్చని నీరు చర్మంలో తేమను తీసివేయకుండా కాపాడుతుంది. చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది.

వర్షాకాలంలో నీరు తాగడం పట్ల చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఇది చర్మం పొడిబారడానికి, శరీరం డీహైడ్రేట్ కు గురికావడానికి కారణం అవుతుంది. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.

సూర్యాకాంతి చాలా తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం మానుకోవాలి. బలమైన సూర్యకిరణాలు చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది. ఒకవేళ సూర్యకాంతిలోకి వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి.

Cholesterol: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు..!



పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా చర్మం పొడిబారకుండా నివారించవచ్చు. ముఖ్యంగా ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.

సౌందర్య సంరక్షణ, ఫ్యాషన్ లో భాగంగా రసాయనాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడకూడదు. ఇవి చర్మానికి హాని కలిగించి చర్మం పొడిబారేలా చేస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుందంటే..!

ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 10 , 2024 | 01:39 PM

Advertising
Advertising
<