ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Skin Care: కళ్ల కింద చర్మం ముడతలు పడిందా? ఈ ఐ ప్యాక్ ట్రై చేయండి..!

ABN, Publish Date - Oct 10 , 2024 | 04:21 PM

కళ్ల కింద చర్మం సున్నితంగా ఉంటుంది. తొందరగా ముడతలు పడుతుంది. ఇది తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి.

శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో కొల్లాజెన్ ఉత్పత్తి త్వరగా ఆగిపోతుంది. కొల్లాజెన్ చర్మం బిగుతును నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల చర్మం ముడుతలు పడి వదులుగా మారుతుంది. 30 సంవత్సరాలు, ఆ పై వయస్సులో కళ్ల కింద వదులుగా, చక్కటి గీతలు కనిపిస్తాయి. కానీ కొన్ని జాగ్రత్తలు, కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే కళ్ల కింద బిగుతు త్వరగా పోదు. దీని కోసం ఐ ప్యాక్ వేసుకోవాలి. దీన్నెలా చేయాలో.. దీనికి కావసిన పదార్థాలేంటో తెలుసుకుంటే..

రతన్ టాటా లైఫ్ సీక్రెట్స్..


ఐ ప్యాక్..

ఐ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

  • వాసెలిన్.. 1 స్పూన్..

  • తేనె.. అర టీస్పూన్..

  • కొబ్బరి నూనె.. కొద్దిగా..

తయారు విధానం..

పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.

ఎలా వాడాలి..

  • తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజూ దీన్ని ఫాలో అవుతుంటే కళ్ల కింద చర్మం బిగుతుగా ఉంటుంది.

  • కళ్ల చుట్టూ ఉన్న చర్మం బిగుతుగా మారడానికి కేవలం పైన చెప్పుకున్న క్రీమ్ మాత్రమే కాదు.. విటమిన్-కె పుష్కలంగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోవాలి.

జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు పసుపు పాలు తాగకూడదు..!


విటమిన్-కె ఆహారాల లిస్ట్..

కాలీఫ్లవర్, కాలర్డ్ గ్రీన్స్, పాలకూర, టర్నిప్ గ్రీన్స్, బ్రస్సెల్ మొలకలు, బ్రోకలీ, ఆస్పరాగస్, సలాడ్, పుల్లని క్యాబేజీ, సోయాబీన్, ఊరగాయ, గుమ్మడికాయ,

పైన్ గింజలు, బ్లూబెర్రీలు.. మొదలైన ఆహారాలలో విటమిన్-కె ఉంటుంది. వీటిని తీసుకుంటే చర్మం బిగుతుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

చర్మాన్ని యవ్వనంగా ఉంచే విటమిన్-ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 10 , 2024 | 04:22 PM