Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:59 PM
నారింజ తొక్కలను ఇలా వాడితే ఏ వాణిజ్య ఉత్పత్తి ఇవ్వనంత ఫలితం పక్కా..
మచ్చలు లేకుండా మెరిసిపోయే చర్మం కావాలని కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇందుకోసం అమ్మాయిలు మార్కెట్లో దొరికే చాలా బ్యూటీ ఉత్పత్తుల కోసం వందలు, వేలాది రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలిక ఫలితాలు ఇస్తాయే కానీ.. దీర్ఘకాలపు ఫలితాలు ఇవ్వవు. నారింజ తొక్కను కింది విధంగా ఉపయోగించడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ, మచ్చలు లేని చర్మం సొంతం కావడంలోనూ సహాయపడుతుంది.
నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..
ఫేస్ ప్యాక్..
నారింజ తొక్కలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ సిద్దం చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టింది 20నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం గ్లో ను పెంచడంలో సహాయపడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది.
స్క్రబ్..
నారింజ తొక్కల స్క్రబ్ ముఖానికి మెరుపును ఇస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి గ్రైండ్ చేయాలి. ఈ పొడికి చక్కెర, ఆలివ్ ఆయిల్ జోడించాలి. ఇలా చేస్తే స్క్రబ్ సిద్దమైనట్టే.. దీన్ని చేతికి తీసుకుని ముఖానికి అప్లై చేసి రుద్దాలి. ఈ స్క్రబ్ చర్మం నుండి మృత కణాలు తొలగించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా చేసి చర్మానికి మెరుపును ఇస్తుంది.
ఈ పదార్థాలు తిన్న తరువాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు..
బాతింగ్ సాల్ట్..
నారింజ తొక్కలను స్నానం చేసేటప్పుడు ఉపయోగిస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నారింజ తొక్కలు ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని సముద్రపు ఉప్పు, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్ లలో కలపాలి. దీన్ని బాతింగ్ సాల్ట్ గా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని స్నానం చేసేటప్పుడు వేడి నీటిలో వేసి స్నానం చేయాలి. చాలా రిఫ్రెషింగ్ గా అనిపించడమే కాకుండా శరీరానికి విశ్రాంతిని కూడా ఇస్తుంది.
టోనర్..
నారింజ తొక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని వడపోసి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఈ నీటిని ముఖం పై స్ప్రే చేయాలి. రోజులో ఒకటి రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకున్న తరువాత ఇలా చేస్తుంటే ఇది నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. ముఖాన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది. ముఖం మీద మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి..
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 24 , 2024 | 12:59 PM