Sleeping: ఎలా నిద్రపోతే ఆరోగ్యం? దిండు వేసుకునా లేక దిండు లేకుండానా? వైద్యులు తేల్చిన నిజాలివే..!
ABN, Publish Date - Jun 24 , 2024 | 12:41 PM
నిద్రించేటప్పుడు చాలామంది తల కింద దిండు వేసుకుంటూ ఉంటారు. మరికొందరు దిండు లేకుండానే నిద్రిస్తుంటారు. అసలు నిద్రించేటప్పుడు దిండు అవసరమా? దిండు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?
నిద్ర మనిషికి గొప్ప ఔషధం అంటారు. ప్రతి వ్యక్తి రోజులో కనీసం 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలని చెబుతారు. అయితే నిద్రించేటప్పుడు చాలామంది తల కింద దిండు వేసుకుంటూ ఉంటారు. మరికొందరు దిండు లేకుండానే నిద్రిస్తుంటారు. అసలు నిద్రించేటప్పుడు దిండు అవసరమా? దిండు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుంది? వైద్యులు తేల్చిన నిజాలేంటో తెలుసుకుంటే..
దిండు వేసుకుని పడుకుంటే..
దిండు వేసుకుని నిద్రపోవడం వల్ల వెన్నెముక బెండ్ కావడాన్ని నివారించవచ్చు. ఇది మెడ, తల, సైడ్, బ్యాక్ స్లీపర్ లకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలామంది దిండుకు కేవలం తల కింద మాత్రమే వేసుకుంటారు. అయితే దిండును తల కింద మాత్రమే కాకుండా మెడ కింద కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.
మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
దిండు వాడటం వల్ల శరీరం పై భాగంలో ఒత్తిడి స్థానాలైన మెడ, భుజాల పై ఒత్తిడి తగ్గుతుంది. ఇలా ఒత్తిడి తగ్గడం వల్ల ఆయా స్థానాలకు కంఫర్ట్ గా ఉంటుంది. ఇది హాయిగా నిద్ర పట్టడానికి ఉపకరిస్తుంది.
దిండు ఉపయోగించడం వల్ల తల సాధారణం కంటే కాస్త ఎత్తులో ఉంటుంది. ఇది శ్వాసనాళాలు తెరచుకోవడానికి, శ్వాస వ్యవస్థ సమర్థవంతంగా సాగడానికి అనువుగా ఉంటుంది. నిద్రలో శ్వాసను మెరుగుపరుస్తుంది. శ్వాసలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తుంది.
దిండు వేసుకుని నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిండు వేసుకోవడం వల్ల తల కాసింత ఎత్తులో ఉంటుంది. జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలు అన్నవాహిక లోకి చొచ్చుకువి రాకుండా చేయడంలో సహాయపడుతుంది.
వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!
దిండు లేకుండా పడుకుంటే..
బోర్లా పడుకునే వారికి దిండు లేకుండా పడుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిండు లేకపోవడం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది.
దిండు వేసుకుని పడుకున్నప్పుడు ముఖం దిండులోకి కుదించినట్టు ఉంటుంది. ఇది ముఖం మీద గీతలు, ముడుతలు రావడానికి కారణం అవుతుంది. అయితే దిండు లేకుండా పడుకుంటే ఈ సమస్యలు ఎదురుకావు.
మెడనొప్పి ఉన్నవారు దిండు లేకుండా పడుకోవడం మంచిది. ఇది మెదడు బెండ్ కాకుండా చేయడంలో సహాయపడుతుంది.
దిండు లేకుండా పడుకుంటే కొందరికి ఎలాంటి అసౌకర్యం లేకుండ నిద్ర వస్తుంది. ఇది శరరం చాలా సహజంగా విశ్రాంతి తీసుకోవడానికి సాధ్యమవుతుంది.
వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!
మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 24 , 2024 | 12:41 PM