ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stress: ఒత్తిడి వేధిస్తోందా? ఈ 5 చిట్కాలతో ఈజీగా తగ్గించుకోండి..!

ABN, Publish Date - Apr 22 , 2024 | 03:07 PM

చిన్న పిల్లల నుండి యువత, వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య. దీనికి కారణాలు ఏవైనా సరే.. దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం.

ఒత్తిడి ఈ కాలంలో చాలా సాధారణంగా వినబడుతున్న పదం. కానీ దీని తీవ్రత మాత్రం చాలా ఎక్కువ. చిన్న పిల్లల నుండి యువత, వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య. దీనికి కారణాలు ఏవైనా సరే.. దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం. ఒత్తిడితో ఇబ్బంది పడే వారు ఈ కింది 5 చిట్కాలతో దాన్నుండి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

వ్యాయామం..

వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో హర్మోన్ల విడుదల ఒక క్రమ పద్దతిలో ఉంటుంది. దీని వల్ల మానసిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరాన్ని మనసును చురుగ్గా ఉంచడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వ్యాయామాలు ఎంచుకోవచ్చు.

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!


నచ్చినవాళ్లతో మాట్లాడటం..

మానసిక ప్రశాంతత బాగుండాలంటే నచ్చినవాళ్లతో మాట్లాడటం చాలా ముఖ్యం. ఒత్తిడికి కారణం ఏదైనా మనసుకు దగ్గరగా ఉండే వాళ్లతో మాట్లాడితే ఒంటరితనం, ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి. మనసు తేలికపడుతుంది. దగ్గరగా ఉన్నవాళ్లు చెప్పే మాటలు కూడా చాలా వరకు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు.

టైం మేనేజ్మెంట్..

చాలామందిలో మానసిక ఒత్తిడికి కారణం టైం మేనేజ్మెంట్ లేకపోవడమే. రోజులో ఎప్పుడూ బిజీగా ఉండేవారు టైం ను మెయింటైన్ చేసుకుంటే చాలావరకు గందరగోళం తగ్గుతుంది. సమయం వారిగా పనులు చ చేస్తుంటే పనులు పూర్తీ కాలేదనే ఆందోళన లేకపోతే ఒత్తిడి కూడా ఉండదు.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!


సెల్ప్ టైమ్..

ఇప్పట్లో చాలామంది తాము ఒత్తిడిలో ఉంటున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎవరికి వారు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. నచ్చిన పని చేయడం. నచ్చిన పుస్తకం చదవడం. నచ్చిన ఆహారం ఆస్వాదించడం. కొద్ది సమయం అయినా నచ్చినట్టు గడపడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే హ్యాపీ హార్మోన్స్ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.

ట్రీట్మెంట్..

మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్లలో దాదాపు సగం కంటే తక్కువ మంది వైద్యున్ని ఆశ్రయిస్తారు. తమది పెద్ద సమస్య కాదని భావించేవారు కొందరైతే మానసిక సమస్యలకు వైద్యుడిని ఆశ్రయించడం పట్ల విముఖత చూపేవారు కొందరు. కానీ ఒత్తిడిని జయించడానికి ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఆశించిన ఫలితాలు లేకుండా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 22 , 2024 | 03:12 PM

Advertising
Advertising