ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Toilet Seat: పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్య నిపుణుల సలహాలు ఇవే..!

ABN, Publish Date - Apr 26 , 2024 | 03:42 PM

ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాత్రూమ్ అవసరాల గురించి చాలా జాగ్రత్త పడి మరీ వెళ్తుంటారు. కానీ బయటకు వెళ్లినప్పుడు, దూర ప్రయాణాలప్పుడు, ఇతర సమయాలలోనూ పదిమంది ఉపయోగించే టాయిలెట్లు ఉపయోగించాల్సిన అగత్యం ఏర్పడుతుంది.

ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాత్రూమ్ అవసరాల గురించి చాలా జాగ్రత్త పడి మరీ వెళ్తుంటారు. కానీ బయటకు వెళ్లినప్పుడు, దూర ప్రయాణాలప్పుడు, ఇతర సమయాలలోనూ పదిమంది ఉపయోగించే టాయిలెట్లు ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఇండియన్ స్టైల్ టాయిలెట్లు ఉంటే మరికొన్ని చోట్ల వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అసలు పబ్లిక్ టాయిలెట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..

బ్యాక్టీరియా చాలా నెలలు పబ్లిక్ టాయిలెట్లలో జీవించగలదు. పబ్లిక్ టాయిలెట్లలో దాదాపు 45 శాతం బాక్టీరియాలు టాయిలెట్‌లోనే పెరుగుతాయి. టాయిలెట్ సీటుపై మాత్రమే కాకుండా సబ్బు డిస్పెన్సర్‌పై కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!


టాయిలెట్ సీటుపై కూర్చునే విషయంలో ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ దానిని తాకడం మానుకోవాలి. టాయిలెట్ సీట్‌ను తాకవలసి వస్తే సీటును ఒట్టి చేతులతో తాకకుండా టిష్యూ పేపర్‌తో సీటును పట్టుకుని, ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. కావాలంటే టాయిలెట్ సీటుపై శానిటైజర్‌ను స్ప్రే చేయవచ్చు.

ఫ్లష్ చేసేటప్పుడు టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. దీని వల్ల చర్మంతో బ్యాక్టీరియా చేరదు. టాయిలెట్ ఉపయోగించాక చేతులను కనీసం 20 నుండి 30 సెకన్ల పాటు బాగా కడగాలి. చేతులు కడుక్కున్న తర్వాత చేతులు ఆరిపోయేలా జాగ్రత్త పడాలి. తడి ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది.

వస్తువులను పబ్లిక్ వాష్‌రూమ్‌లో నేలపై ఉంచే బదులు తలుపు మీద హ్యాంగర్ కు వేలాడదీయడం మంచిది. ఇలా చేయడం వల్ల సూక్ష్మక్రిములు అంటుకోకుండా జాగ్రత్త పడవచ్చు.

భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!

ప్రతిరోజూ పబ్లిక్ టాయిలెట్‌ని ఉపయోగిస్తుంటే శానిటైజర్ ఉంచుకోవాలి. దీనితో చేతుల నుండి క్రిములను తొలగించడం సులువు అవుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 26 , 2024 | 03:42 PM

Advertising
Advertising