Delhi: ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు పోయినట్లే
ABN, Publish Date - Apr 14 , 2024 | 05:07 PM
మీరు నిత్యం ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. తాజా అధ్యయనం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. భారత్‌లో ఫెయిర్‌నెస్ క్రీములది అతిపెద్ద మార్కెట్. అయితే ఇందులో వాడే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నాయట.
ఢిల్లీ: మీరు నిత్యం ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. తాజా అధ్యయనం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. భారత్‌లో ఫెయిర్‌నెస్ క్రీములది అతిపెద్ద మార్కెట్. అయితే ఇందులో వాడే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నాయట. కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక మెర్క్యురీ(పాదరసం) కంటెంట్ ఉన్న ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతీ (MN) కేసులు పెరుగుతున్నాయని.. తద్వారా కిడ్నీల పనితీరు మందగించి.. మూత్రం వడపోతపై ప్రభావం పడుతోందట.
దాంతోపాటు ప్రోటీన్ లీకేజీకి కారణమవుతోంది. MN అనేది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది మూత్రపిండ రుగ్మత. మూత్రం నుంచి ఎక్కువ ప్రోటీన్‌ను విసర్జించేలా చేస్తుంది. "చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్తుంది. అలా కిడ్నీల వరకు చేరుకుని మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది" అని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ సజీష్ శివదాస్ ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
2021 జులై నుంచి 2023 సెప్టెంబర్ మధ్య నమోదైన 22 MN కేసులను అధ్యయనం పరిశీలించింది. ఈ పరిశోధనలో.. ఎంఎన్ బాధితుల్లో కొందరికి అలసట, మూత్రంలో ఎక్కువగా నురుగు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే వారిని ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రికి సమర్పించారు. ముగ్గురు రోగుల మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయి. మరో రోగి మెదడులో రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిసిన్ వృద్ధి చెందింది. 15 మంది లక్షణాలు కనిపించకముందే తాము స్కిన్ ఫెయిర్‌నెస్ క్రీములు వాడినట్లు అంగీకరించారు.
Health: కళ్లకు కంప్యూటర్ కష్టాలు.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు..
ఈ క్రీముల వాడకం ప్రజారోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అలాంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఫెయిర్‌నెస్ క్రీములను అరికట్టడానికి ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేయడం అత్యవసరం అని పరిశోధకులు తెలిపారు. "ఇది కేవలం చర్మ సంరక్షణ/మూత్రపిండాల ఆరోగ్య సమస్య కాదు. ఇది ప్రజారోగ్య సంక్షోభం. చర్మానికి పాదరసం పూయడం వల్ల అలాంటి హాని కలిగిస్తుందంటే కలిగే దుష్పరిణామాలు ఊహించుకోవచ్చు. ఈ హానికరమైన ఉత్పత్తులను నియంత్రించడానికి, ప్రజలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవలసిన సమయం ఇది" అని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 14 , 2024 | 05:08 PM