Vitamin-A: విటమిన్-ఎ లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఓసారి చెక్ చేసుకోండి..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:50 PM
శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్-ఎ ప్రధానమైనది. విటమిన్-ఎ లోపం కారణంగా శరీరంలో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి.
శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరంలో అవయవాలన్నీ సరైన విధంగా పనిచేయాలన్నా శరీరానికి సమతుల్య ఆహారం అవసరం. సమతుల్య ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మొదలైనవన్నీ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా శరీరంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్-ఎ ప్రధానమైనది. విటమిన్-ఎ లోపం కారణంగా శరీరంలో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయో తెలుసుకుంటే..
విటమిన్-ఎ లోపిస్తే రేచీకటి సమస్య వస్తుంది. రాత్రి సమయంలో దృష్టి సరిగా లేకపోవడం, కళ్ళు పొడిగా మారడం రేచీకటిలో ప్రధాన సమస్యలు.
కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!
చర్మం చాలా పొడిగా ఉన్నా, అది దీర్ఘకాలం పాటూ కొనసాగినా విటమిన్-ఎ లోపాన్ని సూచిస్తుంది. ఇలా చర్మం పొడిబారడం వల్ల తామరను ప్రేరేపించే చర్మం చికాకులు, చర్మం వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి.
విటమిన్-ఎ లోపం ఉండేవారిలో అలసట ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయకపోయినా అలసటగా అనిపించడం దీని లక్షణమే.
విటమిన్- ఎ లోపిస్తే ఊహించని విధంగా బరువు తగ్గుతారట. ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, సరిపడినంత ఆహారం తింటున్నా కూడా బరువు తగ్గుతున్నారంటే విటమిన్-ఎ లోపం ఉండవచ్చు.
రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే విటమిన్-ఎ చాలా అవసరం. కానీ విటమిన్-ఎ లోపిస్తే రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. చాలా తొందరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు.
భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!
పిల్లలలో విటమిన్-ఎ లోపం ఉంటే అది వారిలో పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. విటమిన్-ఎ లోపం కారణంగా పిల్లల శారీరక పెరుగుదల నెమ్మదిస్తుంది.
చర్మ కణాల మరమ్మత్తుకు విటమిన్-ఎ చాలా అవసరం. కానీ విటమిన్-ఎ లోపం ఏర్పడితే అది గాయాలు, కోతలు నయం కావడంలో ఆలస్యం చేస్తుంది. వైద్య ప్రక్రియను చాలా నెమ్మదిస్తుంది.
ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!
Bra Vs Breast Cancer: బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజాలెంతంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 06 , 2024 | 03:50 PM