Walking Vs Jogging: వాకింగ్ లేదా జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..!
ABN, Publish Date - Aug 10 , 2024 | 12:18 PM
బరువు తగ్గడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిలో వాకింగ్, రన్నింగ్, జాగింగ్.. ఇతర శారీరక వ్యాయామాలు ఏవో ఒకటి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలి సాగించడానికి దోహదపడతాయి. అయితే ..
బరువు తగ్గడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిలో వాకింగ్, రన్నింగ్, జాగింగ్.. ఇతర శారీరక వ్యాయామాలు ఏవో ఒకటి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలి సాగించడానికి దోహదపడతాయి. అయితే ఏ వయసు వారు అయినా నిస్సంకోచంగా వాకింగ్ ను ఎంచుకుంటారు. యువతలో కొందరు మాత్రం బరువు తగ్గడానికి జాగింగ్ ను ఎంచుకుంటారు. కానీ వాకింగ్, జాగింగ్.. రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది? ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది? దేని వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటే..
Personality Test: మీ చెవుల ఆకారం, పరిమాణం మీలో ఉన్న లక్షణాలను బయటపెడుతుందట.. ఓ సారి చెక్ చేసుకోండి..!
వాకింగ్..
వాకింగ్ ఏ వయసు వారు అయినా ఎలాంటి సంకోచం లేకుండా చేయవచ్చు. సమూహంగా కలసి వాకింగ్ చేయవచ్చు. ఇంట్లోనే ట్రెడ్ మీల్ ఉన్నా కూడా వాకింగ్ కు చక్కగా సహాయపడుతుంది. వ్యాయామం కొత్తగా మొదలు పెట్టేవారికి, ఫిట్‌నెస్ జర్నీ మొదలు పెట్టేవారికి వాకింగ్ మంచి ఆరంభాన్ని ఇస్తుంది. రోజూ 30నిమిషాలు చురుగ్గా నడవడం వల్ల సులభంగా 150-200 కేలరీలు బర్న్ అవుతాయి.
వాకింగ్ లో కూడా వివిధ రకాలు ఉన్నాయి. వీటి మీద అవగాహన పెంచుకుంటూ చేస్తుంటే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అలాగే వాకింగ్ చేయడానికి మెరుగైన ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగదు.
యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
జాగింగ్..
జాగింగ్ అనేది అటు వాకింగ్ కు ఇటు రన్నింగ్ కు మధ్యస్థంగా ఉంటుంది. ఇది తీవ్రతతో కూడిన వ్యాయామం కిందకు వస్తుంది. కేలరీలు వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. దీని వల్ల హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరుగుతాయి. చురుగ్గా 30నిమిషాలు నిడిస్తే 150-200 కేలరీలు బర్న్ అవుతాయి. అదే 30 నిమిషాలు జాగింగ్ చేస్తే ఈజీగా 300-400 కేలరీలు బర్నా్ అవుతాయి.
జాగింగ్ చేస్తే కండరాలు దృఢంగా మారతాయి. జాగింగ్ లో శరీర కదలిక వాకింగ్ కంటే వేగంగా ఉండటం వల్ల శరీరం మొత్తం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. బరువును ఎక్కవ కాలం నియంత్రణలో ఉంచడంలో జాగింగ్ ప్రభావవంతంగా ఉంటుంది. అయితే జాగింగ్ ను అందరూ చేయలేరు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, పెద్ద వయసు వారు, గర్బిణీ స్త్రీలు, సర్జరీలు అయిన వారు, గుండె ఆపరేషన్లు అయినవారు వైద్యుల సలహా లేకుండా జాగింగ్ చేయడం అంత మంచిది కాదు.
రోజూ ఒక లవంగాన్ని నమిలి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఏది మంచిది?
బరువు తగ్గడం కోసం వ్యాయామం చేసేటప్పుడు కేలరీలు ఎందుకో ఎక్కువ బర్న్ అవుతున్నాయన్నదే కాదు.. ఎంత స్థిరత్వంగా బరువు తగ్గుతారు అనేది కూడా ముఖ్యం. వాకింగ్ వల్ల కలిగే ఫలితాలు స్థిరంగా ఉంటాయి. అలాగే వాకింగ్ వల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇతర గాయాలు ఏమీ కావు. కాబట్టి ఇది సురక్షితం.
జాగింగ్ ఆరోగ్యమైనదే అయినప్పటికీ అది అనారోగ్యం చేసిన వ్యక్తులకు, కాళ్ల నొప్పులు వంటి సమస్యలున్న వారికి ఇది సరిపడదు. జాగింగ్ వల్ల తొందరగా అలసిపోతారు కాబట్టి శారీరకంగా బలహీనంగా ఉన్నవారు దీనికి దూరం ఉండాలి. అయితే జాగింగ్ చేయగలిగిన వారు దీనితో వాకింగ్ కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
వాకింగ్, జాగింగ్ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి. ఈ రెండింటిని వ్యాయామంలో భాగం చేసుకోవచ్చు. వారంలో కొన్ని రోజు వాకింగ్ చేయడం, మిగిలిన రోజులు జాగింగ్ చేయడం చేయాలి. ఇది వ్యాయామం పట్ల బోర్ కొట్టకుండా కూడా చేస్తుంది. అయితే జాగ్రత్త తీసుకోవడం మాత్రం తప్పనిసరి.
విటమిన్-ఇ పుష్కలంగా ఉండే ఆహారాల లిస్ట్ ఇది..!
ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎంత డబ్బు ఆదా చేయవచ్చో తెలుసా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 10 , 2024 | 12:18 PM