Water poisoning: నీరు కూడా విషంలా పనిచేస్తుందా? ఎవరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే..!
ABN, Publish Date - Aug 08 , 2024 | 02:34 PM
నీరు పుష్కలంగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు, వ్యర్థాలు సులభంగా బయటకు వెళతాయి. నీరు సరిపడనంత తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుందని అందరికీ తెలుసు. కానీ..
నీరు శరీరానికి ఇంధనం వంటిది. రోజూ 8 గ్లాసుల నీరు లేదా 2 నుండి 3 లీటర్ల నీరు తీసుకోమని వైద్యులు చెబుతుంటారు. నీరు పుష్కలంగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు, వ్యర్థాలు సులభంగా బయటకు వెళతాయి. ఈ కారణంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీరు సరిపడనంత తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుందని అందరికీ తెలుసు. కానీ నీరు విషంలా కూడా పనిచేస్తుందని తెలుసా? దీన్నే వాటర్ పాయిజనింగ్ అంటున్నారు. అసలు నీరు శరీరంలో విషంలా ఎందుకు పనిచేస్తుంది? ఇది ఎవరికి నష్టం కలిగిస్తుంది? తెలుసుకుంటే..
Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదట..!
టెక్సాస్ కు చెందిన జాన్ అనే వ్యక్తి వయసు 74 ఏళ్ళు. ఆరోగ్యానికి మంచిది కదా అని ఆయన నీరు ఎక్కువగా తాగాడు. దీని తరువాత ఆయన అలసట, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కున్నాడు. ఇవన్నీ గుండెపోటుకు సంబంధించిన లక్షణాలే కావడంతో హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ ఆయన శరీరంలో వాటర్ పాయిజనింగ్ జరిగిందని తేలింది.
వాటర్ పాయిజనింగ్..
వాటర్ పాయిజనింగ్ ను వాటర్ ఇంటాక్సికే,న్ లేదా హైపర్ హైడ్రేషన్ అని కూడా పిలుస్తారు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయితో పోలిస్తే శరీరంలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు వాటర్ పాయిజనింగ్ ఏర్పడుతుంది. శరీరంలో సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలే ఎలక్ట్రోలైట్స్ గా పిలవబడతాయి. ఈ ఖనిజాలు శరీరంలో ద్రవ స్థాయిలను బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడతాయి. నరాలు, కండరాల పనితీరుకు ఇవి అవసరం. నీరు ఎక్కువగా తాగినప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు పలుచన అవుతాయి. ఇది ద్రవాల అసమతుల్యతకు దారితీస్తుంది. వాటర్ పాయిజన్ కు కారణం అవుతుంది.
Vakkaya: వాక్కాయ దొరికితే అస్సలు వదలకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు ఉంటాయంటే..!
వాటర్ పాయిజన్ లక్షణాలు..
వాటర్ పాయిజన్ అయినప్పుడు వికారం, వాంతులు, తలనొప్పి, గందరగోళం వంటి సమస్యలు ఏర్పడతాయి.
శరీరం అంతా అలసటగా అనిపిస్తుంది. కండరాల బలహీనత, చేతులు కాళ్లలో తిమ్మిరిగా ఉంటుంది. కొందరు మూర్చపోవచ్చు. కొన్ని సార్లు ఇది కోమాలోకి వెళ్లడానికి కూడా దారితీయవచ్చు.
వాటర్ పాయిజన్ జరిగినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది మెదడు వాపుకు కూడా దారి తీస్తుంది.
ఆడవారు 30ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవి..!
ఎవరికి ప్రమాదం..
అథ్లెట్లు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు హైడ్రేట్ గా ఉండటానికి నీరు ఎక్కువగా తీసుకుంటారు. వీరు మాత్రమే కాకుండా ఆరోగ్య స్పృహ కొద్ది నీటిని అదేపనిగా తాగేవారు కూడా వాటర్ పాయిజన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులు, హార్ట్ ఫెయిల్ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నవారిలో కూడా వాటర్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎంత నీరు తాగాలి..
ప్రతి వ్యక్తి తాగే నీటి పరిమాణం శరీర తత్వాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా రోజుకు 8 గ్లాసుల నీరు తాగడం మంచిదని చెబుతుంటారు. ఇది 2 లీటర్లకు సమానం. ఇంతకంటే ఎక్కువ నీరు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాహం వేయకపోయినా సరే అదే పనిగా నీరు తాగకూడదు. కానీ ఎలాంటి వారు అయినా మరీ 3 లీటర్లకు మించి నీరు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
ఈ 5 సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తినకూడదు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 08 , 2024 | 02:34 PM