WeightLoss: బరువు తగ్గే ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయా? ఖాళీ కడుపుతో ఈ డ్రై ఫ్రూట్స్ గనుక తింటే..
ABN, Publish Date - Feb 23 , 2024 | 02:59 PM
పరగడుపునే ఖాళీ కడుపుతో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.
ఈ కాలంలో లావుగా ఉన్న చాలామందిని గమనిస్తే బరువు తగ్గే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంటారు. కానీ ఇలా బరువు తగ్గే ప్రయత్నంలో ఫలితాలు పొందేది కొందరే.. బరువు తగ్గడం కోసం జిమ్ లో కసరత్తులు, యోగ, డైటింగ్ అన్నీ ఫాలో అవుతారు. కానీ చాలావరకు బరువు తగ్గడంలో ఫలితాలు ఉండవు. అయితే 5 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రం బరువు తగ్గడంలో మ్యాజిక్ చేస్తాయంటే షాకవుతారు. పరగడుపునే ఖాళీ కడుపుతో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. ఇంతకీ బరువు తగ్గాలంటే నానబెట్టి తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలో, అవేంటో తెలుసుకుంటే..
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌లో మంచి మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలోపేతం చేస్తాయి, శరీర పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి: జుట్టు మందంగా పెరగాలంటే తినాల్సిన 9 ఆహారాల లిస్ట్ ఇదీ..!
బాదం..
బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడతాయి. బాదంపప్పును రాత్రంతా నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి, పోషకాల శోషణను పెంచుతాయి. ఇవి ఆకలిని, పదే పదే తినాలనే కోరికలను నియంత్రిస్తాయి.
వాల్నట్స్..
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా ఇది బరువు తగ్గడానికి అద్బుతంగా సహాయపడుతుంది. వాల్‌నట్‌లను నానబెట్టడం వల్ల వాటి చేదు తగ్గుతుంది. జీర్ణం కావడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ అందిస్తుంది.
ఎండు ఫ్లం..
ఎండిన ఫ్లం లో ఫైబర్, సార్బిటాల్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రేగు పండ్లను నానబెట్టడం వల్ల నమలడం, జీర్ణం చేయడం సులభం అవుతుంది. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఖర్జూరం..
నానబెట్టిన ఖర్జూరం చాలా మృదువుగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
రైసిన్స్..
ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
ఇది కూడా చదవండి: త్రిఫల జ్యూస్ పవరేంటో తెలుసా? దీన్ని ఖాళీ కడుపుతో తాగితే జరిగేదిదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 23 , 2024 | 02:59 PM