ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ABN, Publish Date - Jul 22 , 2024 | 09:44 PM

చక్కెర తినడానికి స్వస్తి పలికితే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, ఆహారం మెరుగ్గా జీర్ణం కావడం, శరీరం కాంతివంతమవడం, దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాలు తగ్గడం తదితర ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లలో చక్కెర ఒకటి. చక్కెర వాస్తవానికి రకరకాలు. ఏ చక్కెర పదార్థమైనా సరే శరీరం గ్లూకోజ్‌గా మార్చుతుంది. దీన్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది . ఇక ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే చక్కెరలు కొన్ని అయితే, మరికొన్నింటిని మనమే తయారు చేసుకుంటాం. వీటిని యాడెడ్ షుగర్స్ అంటారు. వీటిని ఆహారంలో అధికంగా వినియోగించినప్పుడు ఆరోగ్యంపై (Health) పెను ప్రభావం పడుతుంది.

శరీరానికి శక్తినిచ్చేవి చక్కెరలే అయినా వీటిని అతిగా తింటే పలు రకాల సమస్యలు వస్తాయి. ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు చక్కెరను తినడం ఆపేస్తుంటారు. ఇలా చక్కెరకు పూర్తిగా గుడ్‌బై చెబితే ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం (What happens when you stop eating sugars).

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


చక్కెరలో కెలొరీలు మాత్రమే ఉంటాయి. పోషక విలువలు సూన్యం. కాబట్టి చక్కెర వినియోగం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు.

చక్కెరతో శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి. దీంతో, ప్రతికూల ప్రభావం పడుతుంది. చక్కెర లేకపోతే గ్లూకోజ్ నిల్వలు స్థిరంగా ఉండి రోజుంతా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా శక్తి స్థాయిలు నిలకడగా ఉంటాయి.

చక్కెర తినకుండా ఉంటే చర్మంపై ఇన్‌ఫ్లమేషన్ ప్రభావం తగ్గి కొత్త నిగారింపు వస్తుంది. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

చక్కెర తినకుండా ఉంటే శరీరంలో కొలెస్టెరాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.


చక్కెర తినకుండా ఉంటే మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆలోచనల్లో స్పష్టత వచ్చి వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూడ్ కూడా మెరుగవుతుంది.

చక్కెర మానేస్తే దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయి.

చక్కెర తక్కువగా తినడం పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగై, శరీరం పోషకాలను మరింత బాగా గ్రహించగలుగుతుంది.

చక్కెర తక్కువగా తింటే పళ్ల క్యావిటీలు ఇతర దంతసమస్యలు దరిచేరవు. ఫలితంగా పళ్లు పదికాలాల పాటు ఊడిపోకుండా ఉంటాయి.

Read Health and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 09:49 PM

Advertising
Advertising
<