Health News: మీ డైట్‌లో వెల్లుల్లి చేరితే.. ఎన్ని లాభాలో తెలుసా?
ABN, Publish Date - Aug 17 , 2024 | 06:16 PM
మారుతున్న కాలానికి తగ్గట్లు మనిషి జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. చెడు జీవనశైలి మన శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం నుంచి అధిక కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న కాలానికి తగ్గట్లు మనిషి జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. చెడు జీవనశైలి మన శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం నుంచి అధిక కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ముందుగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఇందుకోసం కొన్ని కూరగాయలు, ఆయుర్వేద చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనికి వెల్లుల్లి(raw garlic) చాలా ఎఫెక్టివ్ రెమెడీ. మీ ఆహారంలో పచ్చి వెల్లుల్లిని చేర్చుకోండి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి ట్రైగ్లిజరైడ్‌లను పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి సాయపడుతుంది. వెల్లుల్లి నేరుగా తినడానికి ఇష్టం లేకపోతే ఊరగాయతో లాగించేయండి.
వెల్లుల్లిని ఎలా తినాలి
అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని సులభంగా నమిలి తినవచ్చు. రుచి చేదుగా అనిపిస్తే, ఆ తర్వాత కొంచెం నీరు తాగవచ్చు. ఇలా వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
వెల్లుల్లి, తేనె తింటే..
వెల్లుల్లి రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇబ్బంది పడే వారు తేనెతో కలిపి తినవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి రెబ్బను తేనెలో ముంచి తీసుకోవాలి. తద్వారా వెల్లుల్లి చేదు తగ్గుతుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల మీరు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కావాలంటే వెల్లుల్లిని తరిగి అందులో తేనె కలిపి వారం రోజుల పాటు బాక్సులో నిల్వ చేసుకోవచ్చు. అలా వారమంతా సులభంగా తినవచ్చు.
For Latest News and AP news click here
Updated Date - Aug 17 , 2024 | 06:16 PM