Water Intoxication: ఎండాకాలం కదా అని నీళ్లు తెగ తాగేస్తున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే..
ABN, Publish Date - Jun 02 , 2024 | 07:33 AM
అతిగా నీరు తాగితే వాటర్ ఇన్‌టాక్సికేషన్ బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కణాల్లో అతిగా నీరు చేరి పలు సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే.. ఏదైనా సరే పరిమితి దాటకూడదు. మంచి నీళ్లకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. మంచి ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం అవసరమని తెలిసిందే. అయితే, ఎండాకాలం కదా అని కొందరు నీరు తెగ తాగేస్తుంటారు. ఇలా చేస్తే వేడి నుంచి పూర్తి రక్షణ (Health) వస్తుందని భావిస్తుంటారు. కానీ, అతిగా నీరు తాగితే అది విషతుల్యం (Water Intoxication) అవుతుందని చెప్పుతున్నారు.వాటర్ ఇన్ టాక్సికేషన్ కు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి వాటర్ ఇన్ టాక్సికేషన్ అంటే ఏంటో..దాని లక్షణాలు ఏంటో ఓసారి చూద్దాం.
స్వల్ప వ్యవధిలో ఎక్కువ తీరు తాగితే పలు అనారోగ్యాలు కలుగుతాయి. దీన్నే వాటర్ ఇన్‌టాక్సికేషన్ అంటారు. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో వివిధ లవణాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా సోడియం స్థాయిలు తగ్గి హైపోనేట్రేమియా బారిన పడతారు. దీంతో, కణాల్లోకి నీరు అధికంగా చేరి అవి ఉబ్బుతాయి. మెదడులో కూడా ఇలా కణాలు ఉబ్బినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పులు, ఫిట్స్, కోమాకు దారి తీయచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించొచ్చు.
Jaggery: అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు బెల్లం తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
అతిగా నీరు తాగినప్పుడు సాధరణంగా కడుపులో తిప్పడం, వాంతులు, తలనొప్పి, కన్‌ఫ్యూషన్ వంటివి తలెత్తుతాయి. పరిస్థితి మరింతగా దిగజారితే కండరాలు బలహీనపడతాయి, రక్తపోటు పెరుగుతుంది. ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, తలతిరగడం, ఫిట్స్ వస్తాయి. పరిస్థితి బాగా ముదిరినప్పుడు ప్రాణాంతకమైన బ్రెయిన్ హెర్నియేషన్ కూడా సంభవిస్తుంది.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఓ మనిషి రోజుకు ఎంత నీరు తాగాలనేది వారి వారి వయసు, బరువు, నిత్యం చేసే పనులు, వాతావరణం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే, పెద్దలు రోజుకు గరిష్ఠంగా రెండు నుంచి మూడు లీటర్ల నీరు వరకూ తాగొచ్చు. వాతావరణంలో నీరు ఎక్కువగా ఉంటే మరింత నీరు తీసుకొవచ్చు. మనిషి కిడ్నీలు గంటకు ఒక లీటర్ నీరును శుద్ధి చేయగలవు. కాబట్టి, తక్కువ వ్యవవధిలో కిడ్నీ సామార్థ్యాన్ని మించిపోయేలా నీరు తాగితే హైపోనాట్రేమియా బారిన పడే అవకాశం ఉంది.
Updated Date - Jun 02 , 2024 | 08:10 AM