ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health: ఆరోగ్యవంతుల్లోనూ కార్డియాక్ అరెస్టు! కారణాలు ఇవే..

ABN, Publish Date - Dec 14 , 2024 | 10:38 PM

ఆరోగ్యవంతులు కూడ కార్డియాక్ అరెస్టు బారిన పడటానికి కొన్ని ముఖ్యకారాణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా కనిపించే వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోతుంటారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తుంటారు. ఇలా సడెన్‌గా గుండెకొట్టుకోవడం ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్టు అని అంటారు. అంటే.. అకస్మాత్తుగా గుండె స్తంభించిపోవడం అన్నమాట (Health).

గుండె కండరాల కదలికలకు కారణమైన విద్యుత్ ప్రవాహ వ్యవస్థలో అకస్మాత్తుగా ఇబ్బంది తలెత్తిపోతున్నప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇక గుండెపోటు లేదా హార్ట్‌ఎటాక్ సంభవించినప్పుడు గుండెకు రక్తసరఫరా నిలిచిపోయి కండరాలు దెబ్బతింటాయి. ఫలితంగా గుండె కొట్టుకోవడం ఆగి మరణం సంభవిస్తుంది.

Cigarettes - Smoking: టీ, సిగరెట్ అలవాటుందా? ఎలాంటి ఇబ్బందులొస్తాయో తెలిస్తే..


గుండె కొట్టుకోవడం లయతప్పడాన్ని అరిథ్మియా అని అంటారు. విద్యుత్ ప్రవాహవ్యవస్థలో అంతరాయం ఏర్పడినప్పడు తలెత్తే ఈ పరిస్థితి చివరకు గుండె స్తంభించిపోయేలా చేయగలదు. సాధారణంగా గుండెలోని వెంట్రికల్స్ అనే చాంబర్‌లు లయతప్పుతుంటాయని, దీన్ని వెంట్రిక్యులర్ ఫిబ్రిల్లేషన్ అని వైద్యులు చెబుతారు. గుండె సంబంధిత సమస్యలేవీ లేనట్టు కనిపించేవారిలోనూ అరిథ్మియాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అధిక శారీరక శ్రమ, ఒత్తిడి, జన్యుపరమైన అంశాలు కారణమని చెబుతున్నారు. గుండె కండరాలు మందంగా మారడం, లేదా గుండె విద్యుత్ ప్రవాహ వ్యవస్థలో లోపాలు పరీక్షల్లో కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో కార్డియాక్ అరెస్టు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.

Cancer Screening test: క్యాన్సర్ ముప్పు! తప్పనిసరిగా చేయించుకోవాల్సిన 5 స్క్రీనింగ్ టెస్టులు


అధిక శారీరక శ్రమ చేసే క్రీడాకారుల్లో గుండెపై ఒత్తిడి పెరుగుతుందట. ఇది చివరకు అరిథ్మియాలకు దారి తీయడంతో పాటు కార్డియాక్ అరెస్టు సంభవించే ప్రమాదం ఉంది.

శరీరంలో విద్యుత్ ప్రవాహానికి ఎలక్ట్రోలైట్ల మధ్య సమతౌల్యం కీలకం. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాల మధ్య సమతౌల్యం దెబ్బతింటే గుండె లయ తప్పే ప్రమాదం ఉంది.

కొన్ని రకాల జన్యుసంబంధిత అంశాలు కూడా కార్డియాక్ అరెస్టుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మైయోకార్డైటిస్ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా ఈ పరిస్థితికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

కార్డియాక్ అరెస్టుకు బారినపడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, ఛాతిలో ఏ చిన్న నొప్పి కలిగినా వెంటనే వైద్యులను సంప్రదిస్తే గుండె సంబంధిత సమస్యల రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు.

Makeup: ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉండొచ్చో తెలుసా? ఈ లిమిట్ దాటితే తిప్పలే!

Read Latest and Health News

Updated Date - Dec 14 , 2024 | 10:38 PM