ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!

ABN, Publish Date - Jun 28 , 2024 | 01:05 PM

యోగలో చాలా రకాల అసనాలు, ధ్యాన పద్దతులు ఉంటాయి. అయితే వీటన్నింటిని ఫాలో కావడానికి నేటి కాలం ఉరుకుల పరుగుల జీవితంలో సమయమే ఉండదు. ఇలాంటి వారికోసం యోగ నిపుణులు అద్బుతమైన పరిష్కారం చెప్పారు. 30రోజుల పాటూ కేవలం రెండు ఆసనాలు వేస్తుంటే ..

ఆరోగ్యంగా ఉండడం అంటే మానసికంగా, శారీరకంగా రెండూ విధాల ఫిట్ గా ఉండటం. ఈ రెండింటిని చేకూర్చేది ఏదైనా ఉందంటే అది యోగ నే. యోగలో చాలా రకాల అసనాలు, ధ్యాన పద్దతులు ఉంటాయి. అయితే వీటన్నింటిని ఫాలో కావడానికి నేటి కాలం ఉరుకుల పరుగుల జీవితంలో సమయమే ఉండదు. ఇలాంటి వారికోసం యోగ నిపుణులు అద్బుతమైన పరిష్కారం చెప్పారు. 30రోజుల పాటూ కేవలం రెండు ఆసనాలు వేస్తుంటే శరీరం ఫిట్‌నెస్ లెవల్ మరో స్థాయికి వెళుతుందని అంటున్నారు. ఆ రెండు యోగ ఆసనాలు ఏంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

Health tips: మీరు సిట్టింగ్ వర్క్ చేస్తుంటారా? జాగ్రత్తపడకుంటే ఈ 9 సమస్యలు రావడం పక్కా..!


నౌకాసనం..

నౌకాసనం మొత్తం శరీరానికి మేలు చేస్తుంది. ఈ ఆసనం వేయడానికి యోగా మ్యాట్ లేదా మెత్తని దుప్పటి మీద కూర్చోవాలి. రెండు కాళ్లను ముందుకు చాచాలి. చేతులను ముందుకు చాచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి ఛాతీ, తల, కాళ్లను పైకి లేపాలి. తుంటి మీద శరీర బరువు ఉంచి అదే పొజిషన్ లో కొన్ని సెకెన్ల పాటూ ఉండాలి. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు శరీరం పడవ ఆకారంలో ఉంటుంది. ఈ ఆసనంలో ఒత్తిడి కడుపుపై ఉంటుంది.

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!


ప్రయోజనాలు..

నౌకాసనం వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. పొట్ట, నడుము ప్రాంతాలలో కొవ్వు తగ్గుతుంది. వెన్నెముక బలంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది.

ధనురాసనం..

ధనురాసనం వేయడానికి బోర్లా పడుకోవాలి. చేతులను కాళ్లకు దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతులతో పాదాల చీలమండలను పట్టుకుని ముందు వైపు చూస్తూ మెడును నిటారుగా ఉంచాలి. ఇప్పుడు శరీరాన్ని విల్లులాగా వంచాలి. ఇదే పొజిషన్లో కొన్ని సెకెన్ల పాటూ ఉండాలి. ఆ తరువాత ఊపిరి తీసుకుంటూ మెల్లగా సాధారణ స్థితికి రావాలి.

Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!



ప్రయోజనాలు..

ధనురాసనం శరీరంలో కేలరీలు తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియలో మెరుగుదల ఉంటుంది. కండరాలు బలపడతాయి. వెన్నునొప్పి నుండి ఉపశమనం ఉంటుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.

Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!

Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 7 టిప్స్ తో చెక్ పెట్టండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.



Updated Date - Jun 28 , 2024 | 01:10 PM

Advertising
Advertising