ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cakes: కేక్ అంటే ఇష్టపడే వారికి నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇదే!

ABN, Publish Date - Oct 11 , 2024 | 10:41 AM

బేకరీల నుంచి తెచ్చుకునే కేక్, ఇతర ఫుడ్ ఐటెమ్స్ హానికారక సూక్ష్మక్రిములతో కలుషితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తీవ్ర అలెర్జీ రియాక్షన్స్ తలెత్తి మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో కేక్స్ విషతుల్యంగా మారి ప్రాణాలు హరిస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్యే బెంగళూరులో ఓ 5 ఏళ్ల బాలుడు కులుషితమైన కేక్ తిని కన్నుమూశాడు. అంతకుమునుపు, హర్యానాలో ఓ 10 ఏళ్ల బాలిక పుట్టిన రోజు సందర్భంగా కేక్ తిని మరణించింది. ఆమె కుటుంబసభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు. అయితే, ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకోవడానికి కారణంగా కేక్‌లు కలుషితం కావడమేనని వైద్యులు చెబుతున్నారు ‘(Health).

పచ్చి గుడ్లు, సరిగా ఉండికించని గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, సరిగా కడగని పండ్లపై ఈకొలై, సాల్మొనెల్లా, వైరస్‌ల వంటి హానికారక సూక్ష్మక్రిములు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వాటితో చేసే కేక్‌లు కలుషితమవుతాయని హెచ్చరిస్తున్నారు. చివరకు వ్యాధులకు దారి తీస్తాయని అంటున్నారు.

Viral: 40 ఏళ్లు దాటాక హ్రస్వదృష్టి కనుమరుగవుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..


దీనికి తోడు, ఆహారాన్ని వండే సమయంలో, ప్యాక్ చేసేటప్పుడు, సరఫరా చేసేటప్పుడు కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక వీటిల్లో వేసే చక్కెరలు కూడా ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయని తెలిపారు. అయితే, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో కలుషితమైన కేక్‌ల వల్ల తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్, బీపీ, లివర్ సంబంధిత సమస్యలు, సుదీర్ఘకాలం పాటు స్టెరాయిడ్ వాడకంతో ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇలాంటి సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు రోగులలో దురద, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ముఖంలో వాపు వంటి అలర్జీ రియాక్షన్లు కనిపిస్తాయి, మరికొందరిలో పెదాలు, గొంతుక, నాలుక వాచడం వంటి తీవ్ర సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇక ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తలెత్తే డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి వంటివి కూడా కొందరిలో కనిపిస్తాయి.

AGE Compounds: భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్.. ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో వెల్లడి


తీవ్రస్థాయిలో ఆహారం కలుషితమైన సందర్భాల్లో రోగులకు డయేరియా, కిడ్నీ సమస్యలు వంటివి కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రెస్టారెంట్లు, హోటళ్ల వారు ప్రామాణిక ఆహార తయారీ పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలను విడివిడిగా ఉంచడం, గరిటెలువంటి వాటిని బాగా శుభ్రం చేశాక వాడటం, వంట చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచడం వంటివి చేస్తే ఆహారం కలుషితం అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు. ఇక ఫుడ్స్ విషయంలో మంచి బ్రాండ్స్‌ను ఎంచుకుంటే ఆరోగ్యాన్ని పదికాలాల పాటు కాపాడుకోవచ్చని కూడా సూచిస్తున్నారు.

Snoring: రాత్రి గురకతో నిద్ర చెడిపోతోందా? ఇలా చేస్తే సమస్య నుంచి విముక్తి!

Read Health and Latest News

Updated Date - Oct 11 , 2024 | 11:07 AM