ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐన్‌స్టీన్‌, హాకింగ్‌ను మించిన ఐక్యూ

ABN, Publish Date - Dec 02 , 2024 | 03:27 AM

ఆ భారత సంతతి బ్రిటిష్‌ కుర్రాడి వయసు 10 ఏళ్లు..! పేరు కశ్యప్‌ అరోరా. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లుగా..

భారత సంతతి బ్రిటిష్‌ కుర్రాడి ఘనత

లండన్‌, డిసెంబరు 1: ఆ భారత సంతతి బ్రిటిష్‌ కుర్రాడి వయసు 10 ఏళ్లు..! పేరు కశ్యప్‌ అరోరా. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లుగా.. ఇంటెలిజెన్స్‌ కోషెంట్‌(ఐక్యూ)లో ఏకంగా అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, కృష్ణబిలాలపై ఎన్నో పరిశోధనలు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌ను మించిపోయాడు. పదేళ్ల ప్రాయంలోనే 162 ఐక్యూ స్కోర్‌ను సాధించాడు. అంతేకాదు.. ఐక్యూ అధికంగా ఉన్న వారికి మాత్రమే పరిమితమైన ‘మేన్సా’ సొసైటీలో సభ్యుడైపోయాడు. త్వరలో క్వీన్‌ ఎలిజబెత్‌ స్కూల్‌లో చేరనున్నాడు. తనకు స్కూలుకు వెళ్లాలని ఉండదని.. అక్కడ కేవలం వాక్యాలను రాయడం.. చిన్నచిన్న లెక్కలపై సమస్యలను సాధించడంతోనే రోజంతా గడిచిపోతుందని.. తనకు ఆల్‌జిబ్రా అంటే ఇష్టమని క్రిష్‌ చెబుతున్నాడు. ‘‘క్రిష్‌కు లెక్కలంటే ఇష్టం. అయితే.. అతని నాలుగో ఏట మొత్తం లెక్కల పుస్తకాన్ని మూడు గంటల్లో పూర్తిచేశాడు. ఎనిమిదో ఏట.. తన క్లాస్‌ సబ్జెక్టులన్నింటినీ ఒక్కరోజులో చుట్టేశాడు’’ అని క్రిష్‌ తల్లిదండ్రులు వివరించారు. పియానో వాయించడంలో కూడా క్రిష్‌ దిట్ట.

Updated Date - Dec 02 , 2024 | 03:27 AM