ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాడివేడిగా ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌..

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:33 AM

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌, కమలా హ్యారిస్‌ మధ్య తొలి డిబేట్‌ వాడివేడిగా జరిగింది. ట్రంప్‌ కమలను మార్క్సి్‌స్టగా అభివర్ణిస్తే.. కమల ట్రంప్‌ను నియంతలను ఆరాధించే వ్యక్తి అన్నారు! రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశం ప్రస్తావనకు

అదరగొట్టిన కమలా హ్యారిస్‌

ప్రత్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యం

కమలను మార్క్సి్‌స్టగా అభివర్ణించిన ట్రంప్‌

ట్రంప్‌ నియంతలను ఆరాధిస్తారన్న కమల

వాషింగ్టన్‌, సెప్టెంబరు 11: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌, కమలా హ్యారిస్‌ మధ్య తొలి డిబేట్‌ వాడివేడిగా జరిగింది. ట్రంప్‌ కమలను మార్క్సి్‌స్టగా అభివర్ణిస్తే.. కమల ట్రంప్‌ను నియంతలను ఆరాధించే వ్యక్తి అన్నారు! రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ట్రంప్‌ కమలను ‘అసమర్థ సంధానకర్త (బ్యాడ్‌ నెగోషియేటర్‌)’ అంటే.. ‘పుతిన్‌ నిన్ను లంచ్‌లో నంచుకుతినేస్తాడు’ అంటూ కమల తిప్పికొట్టారు. ఈ సంవాదంలో ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. కాపిటోల్‌హిల్‌పై దాడి గురించి, ట్రంప్‌ పాత పాపాల గురించి అడిగి ఇరుకునపెట్టారు. కమల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రంప్‌ ఒక దశలో ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. డిబేట్‌ మొదట్లోనే... ట్రంప్‌పై ఉన్న కేసుల గురించి కమలా హ్యారిస్‌ గట్టిగా ప్రస్తావించారు. పోర్న్‌స్టార్‌తో హష్‌ మనీ కేసులో సివిల్‌ కోర్టు శిక్ష విధించిన విషయాన్ని గుర్తుచేశారు. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి ఎంత మాత్రం అర్హుడు కారని వాదించారు. ఈ డిబేట్‌లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన విధానపరమైన అంశాలు.. ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి హక్కులు, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ. బైడెన్‌ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదని ట్రంప్‌ విమర్శించగా.. ట్రంప్‌ పాలనలో ధ్వంసమైన ఆర్థికవ్యవస్థ తమ చేతికి వచ్చిందని కమల తిప్పికొట్టారు. దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం కమలాహ్యారిసేనని.. అలా వస్తున్న వలసదారులు తినడానికి తిండి లేక ప్రజల పెంపుడుకుక్కల్ని తింటున్నారంటూ ఆన్‌లైన్‌లో వచ్చే వదంతులను ట్రంప్‌ ప్రస్తావించారు. ట్రంప్‌ పాలనలో ఇమిగ్రేషన్‌, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో లోపాలను కమల ఎత్తిచూపారు. అబార్షన్ల హక్కుపైనా ట్రంప్‌ను నిలదీశారు. ఆయన అధ్యక్షుడైతే అబార్షన్ల నిషేధ చట్టంపై సంతకం చేస్తారన్నారు. అబార్షన్ల నిషేధానికి తాను అనుకూలం కాదని ట్రంప్‌ పేర్కొన్నారు.

యుద్ధాలపైనా..

ఇజ్రాయెల్‌-హమాస్‌, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ అంశాలపై ట్రంప్‌, హ్యారిస్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కమలాహ్యారి్‌సను అసమర్థ సంధానకర్తగా అభివర్ణించిన ట్రంప్‌.. తాను గెలిస్తే అధ్యక్షుడిగా (2025 జనవరిలో) పగ్గాలు చేపట్టే సమయానికే ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తెస్తానని చెప్పారు. అయితే.. ఈ యుద్ధం మొదలైనప్పుడు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ పాటికే పుతిన్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో తిష్ఠవేసి యూర్‌పపై దృష్టి సారించి ఉండేవారని కమల ఆందోళన వ్యక్తం చేశారు. కమల గెలిస్తే ఇజ్రాయెల్‌ ఉనికి లేకుండా చేస్తారని, ఆమె ఇజ్రాయెల్‌ ద్వేషి అని ట్రంప్‌ వ్యాఖ్యానించగా.. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కుందని, అయితే ఈ యుద్ధం ముగియాలని తాము కోరుకుంటున్నామని కమల చెప్పారు. ట్రంప్‌ చైనాకు అమ్ముడుపోయారని, ఆయన నియంతలను ఆరాధిస్తారని, ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌కు ప్రేమలేఖలు రాశారని కమల అంటే... చైనా, రష్యా, ఉత్తరకొరియా తనకు భయపడ్డాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ సంవాదంలో కమల అదరగొట్టారని అమెరికా మీడియా కితాబివ్వడం గమనార్హం! డిబేట్‌ 105 నిమిషాలపాటు జరిగింది. కాగా.. కమలకు, రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ భార్య ఉషకు.. ఇద్దరికీ భారతీయ మూలాలున్నా ఈ డిబేట్‌లో ఎక్కడా భారత్‌ గురించి ప్రస్తావన రాకపోవడం గమనార్హం.


హ్యావ్‌ ఫన్‌.. ట్రంప్‌ వ్యంగ్యం

డిబేట్‌ మొదలుపెట్టడానికి ముందు కమలాహ్యారిస్‌ ట్రంప్‌తో కరచాలనం చేశారు. ఆ సమయంలో ఆమె తన పేరు చెప్పగా.. ‘నైస్‌ టు సీ యూ.. హ్యావ్‌ ఫన్‌’ అంటూ ట్రంప్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు. 2016 తర్వాత ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో అధ్యక్ష అభ్యర్థులు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోవడం ఇదే మొదటిసారి అని అమెరికన్‌ మీడియా తెలిపింది.

శభాష్‌ కమలా..

డిబేట్‌ తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. కమలా హ్యారిస్‌ అమెరికాకు అధ్యక్షురాలు కావడం తథ్యమని వారు అభిప్రాయపడ్డారు. డిబేట్‌లో ఆమె అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు. కమల తన విజన్‌ను స్పష్టంగా చెప్పగలిగారని కొనియాడారు. జోబైడెన్‌ కూడా.. అమెరికాకు కమలా హ్యారిస్‌ ఒక గొప్ప అవకాశమంటూ ట్వీట్‌ చేశారు. పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ కూడా కమలకు మద్దతు ప్రకటించారు.

చెవి పోగులేనా?

ఈ డిబేట్‌లో కమలా హ్యారిస్‌ ధరించిన చెవి పోగులపై సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. డిబేట్‌ ముగిసిన అనంతరం.. అచ్చం ఆమె ధరించిన చెవి పోగుల్లాంటి ఇయర్‌ఫోన్లనే ఒక టెక్‌ ఆర్టికల్‌లో చూశానంటూ ‘ఎక్స్‌’లో ఒక వ్యక్తి ట్వీట్‌ చేశాడు. అది వైరల్‌ అయ్యింది. మరికొందరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 05:33 AM

Advertising
Advertising