Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 30 మంది మృతి, పలువురికి గాయాలు
ABN, Publish Date - Sep 22 , 2024 | 01:12 PM
తూర్పు ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకైంది. దీంతో భారీ పేలుడు సంభవించి 30 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ఇచ్చింది.
తూర్పు ఇరాన్(Iran)లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, మరో 17 మంది గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 535 మైళ్ల దూరంలో ఉన్న తబాస్ బొగ్గు గనిలో శనివారం అర్థరాత్రి ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు అత్యవసర సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపినట్లు తెలిపారు.
శనివారం రాత్రి పేలుడు సంభవించిన సమయంలో దాదాపు 70 మంది అక్కడ పనిచేస్తున్నారని వెల్లడించారు. చమురు ఉత్పత్తి చేసే ఇరాన్‌లో అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇరాన్ సంవత్సరానికి 3.5 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగిస్తుంది.
దర్యాప్తునకు ఆదేశం
శనివారం రాత్రి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ పేలుడు సంభవించిందని అక్కడి మీడియా తెలిపింది. పేలుడు నేపథ్యంలో గాయపడిన 28 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని స్టేట్ టీవీ తెలిపింది. గనిలో చిక్కుకున్న మరికొంత మందిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కోసం న్యూయార్క్ వెళ్లడానికి సిద్ధమైన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ చిక్కుకున్న వారిని రక్షించడానికి, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలను చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
గతంలో కూడా
ఇరాన్ మైనింగ్ పరిశ్రమకు ఇది మొదటి విపత్తు కాదని చెప్పవచ్చు. ఎందుకంటే 2013లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మైనింగ్ ప్రమాదాల్లో పదకొండు మంది కార్మికులు మరణించారు. 2009లో పలు ఘటనల్లో 20 మంది కార్మికులు చనిపోయారు. 2017లో బొగ్గు గని పేలుడులో 42 మంది మృతి చెందారు. ఈ మరణాలు తరచుగా జరగుతుండటం పట్ల అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలవమైన భద్రతా ప్రమాణాలు, మైనింగ్ ప్రాంతాలలో అత్యవసర సేవలు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు. అనేక ఏళ్లుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: వచ్చే వారం ఏకంగా 11 కొత్త ఐపీఓలు.. వీటిలో కొన్ని..
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Read MoreInternational News and Latest Telugu News
Updated Date - Sep 22 , 2024 | 01:28 PM