Huge Explosion: రెస్టారెంట్‌లో భారీ పేలుడు..ఒకరు మృతి, 22 మందికి గాయాలు
ABN, Publish Date - Mar 13 , 2024 | 09:46 AM
ఓ రెస్టారెంట్‌లో బుధవారం ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. దీంతో రెస్టారెంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి చుట్టపక్కలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో 22 మందికి పైగా గాయపడ్డారు.
ఓ రెస్టారెంట్‌లో బుధవారం ఆకస్మాత్తుగా భారీ పేలుడు(huge explosion) సంభవించింది. దీంతో రెస్టారెంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి చుట్టపక్కలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో 22 మందికి పైగా గాయపడ్డారు. అయితే పేలుడు బలంగా సంభవించిన కారణంగా సమీపంలోని అనేక కార్లు, ఇతర భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన చైనా(china)లోని హెబీ ప్రావిన్స్‌లోని సాన్హే నగరం(Shanghai city)లో చోటుచేసుకుంది.
బీజింగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాన్హే నగరంలో ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగిందని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ లీకేజీ(gas leak)తో పేలుడు సంభవించిందని తెలుస్తోంది. పేలుడు ఘటన నేపథ్యంలో అక్కడి ప్రజలను(people) రక్షించేందుకు 36 వాహనాలు, 154 మంది రెస్క్యూ సిబ్బందిని మోహరించినట్లు అక్కడి రెస్క్యూ విభాగం తెలిపింది. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి జో బైడెన్ పేరు ఖరారు
Updated Date - Mar 13 , 2024 | 09:46 AM