UK: బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి ఓటమి.. పోలైన ఓట్లు 179 మాత్రమే

ABN, Publish Date - Jul 06 , 2024 | 08:26 AM

బ్రిటన్(Britain) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ పార్టీకి చెందిన కియర్ స్టార్మర్ (61)(Keir starmer) బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. 61 ఏళ్ల కైర్ స్టార్మర్ ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

UK: బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి ఓటమి.. పోలైన ఓట్లు 179 మాత్రమే

లండన్‌: బ్రిటన్(Britain) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ పార్టీకి చెందిన కియర్ స్టార్మర్ (61)(Keir starmer) బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. 61 ఏళ్ల కైర్ స్టార్మర్ ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన 9 ఏళ్ల తర్వాత కియర్ స్టార్మర్ ఈ ఘనత సాధించబోతున్నారు. ప్రస్తుత భారత సంతతి ప్రధాని రిషి సునక్ తన ఓటమిని అంగీకరించారు. దీంతో రిషీ సునక్ కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలన ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అభ్యర్థి.


ఇది బరిలో దిగినప్పటి నుంచే ఏఐ స్టీవ్ పేరుతో ఓట్లు అభ్యర్థించింది. అయితే ఎన్నికల్లో దీన్ని ఎవరూ నమ్మలేదు. పోలైన ఓట్లలో కేవలం 179 మంది మాత్రమే ఏఐ అభ్యర్థికి ఓటు వేశారు. పోటీలో దిగినప్పటి నుంచి ఎన్నికల్లో నిలబడ్డ తొలి ఏఐగా బ్రిటన్ వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు వస్తున్న క్రమంలో వ్యాపారవేత్త స్టీవ్‌ కాట్‌కు తన స్థానంలో ఏఐ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన వచ్చింది.


దీంతో తన ఫొటో సాయంతో రూపొందించిన ఏఐ అవతార్‌‌ను వాడారు. ‘ఏఐ స్టీవ్‌’ పేరుతో నామినేషన్‌ సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వర్చువల్‌ అభ్యర్థి కాట్‌ తరపున, ప్రచారంలో పాల్గొంది. బ్రిటన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వర్చువల్‌ అభ్యర్థిగా ఏఐ స్టీవ్‌ చరిత్ర సృష్టించినప్పటికీ.. ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది. చివరికి 179 ఓట్లతో సరిపెట్టుకుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 08:54 AM

Advertising
Advertising