Taiwan: ఇది పార్లమెంటా.. లేక వీధిరౌడీల అడ్డానా.. మరీ ఇంత చిల్లరగానా?
ABN, Publish Date - May 18 , 2024 | 02:20 PM
అప్పుడప్పుడు పార్లమెంట్‌లో విపక్షాలు తారాస్థాయిలో ఆందనళలు చేపట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగట్టిగా నినాదాలు చేయడం, స్పీకర్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం లాంటి సందర్భాలు..
అప్పుడప్పుడు పార్లమెంట్‌లో (Parliament) విపక్షాలు తారాస్థాయిలో ఆందనళలు చేపట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగట్టిగా నినాదాలు చేయడం, స్పీకర్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం లాంటి సందర్భాలు చాలానే వెలుగుచూశాయి. కానీ.. ఎంత రచ్చ చేసినా మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తారు. ఎవరూ విచక్షణ కోల్పోయి పరస్పర దాడులు జరుపుకోరు. కానీ.. తైవాన్‌లో (Taiwan) మాత్రం వీధిరౌడీల అడ్డాని తలపించే విధంగా పార్లమెంట్ సభ్యులు వ్యవహరించారు. చొక్కాలు పట్టుకొని కొట్టేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఒకరినొకరు ఎత్తిపడేసుకున్నారు.
హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేసిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే!
అసలు ఏమైందంటే.. సంస్కరణలకు సంబంధించి శుక్రవారం తైవాన్ పార్లమెంట్‌లో ఒక బిల్లుని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా.. విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు గాను.. ఎంపీలకు మరింత అధికారాలు ఇవ్వాలని కోరాయి. అంతేకాదు.. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసే ఎంపీలపై నేరాభియోగాలు మోసేలా ఆ బిల్లులో ఉన్న ప్రతిపాదనని సైతం వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే.. సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. పరస్పర దాడులు జరుపుకునే స్థితికి చేరింది. స్పీకర్ చుట్టూ చేరి, గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. టేబుళ్లపై ఎక్కి దూకడం, సహచర సభ్యుల్ని బెంచీల నుంచి కిందకు తోసేయడం, పైకి ఎత్తేసి కిందకు పడేయడం వంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ ఘటనలతో పార్లమెంట్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి వెళ్లనివ్వకుండా..
ఇలా సభ్యులందరూ గొడవ పడుతున్న సమయంలో.. ఓ సభ్యుడు ఈ బిల్లు ఆమోదం పొందడకుండా ఉండాలని దస్త్రాలను దొంగలించాడు. ఆ ఫైల్ పట్టుకొని.. సభ నుంచి బయటకు పరిగెత్తాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇంకొన్ని రోజుల్లోనే తైవాన్‌లో కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
Read Latest International News and Telugu News
Updated Date - May 18 , 2024 | 02:20 PM