ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

25 వేల కోట్ల అమ్మకాలు

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:23 AM

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. ఆ కంపెనీలో తనకున్న వాటాలో 300 కోట్ల డాలర్ల (రూ.25,240 కోట్ల) విలువైన 1.6 కోట్ల షేర్లను తాజాగా విక్రయించారు.

  • అమెజాన్‌లో 1.6 కోట్ల షేర్లను విక్రయించిన జెఫ్‌ బెజోస్‌

  • విలువ 300 కోట్ల డాలర్లు.. ప్రపంచ ధనికుల్లో 2వ స్థానానికి

  • అంతరిక్షం, మీడియా రంగాల్లో పెట్టుబడుల విస్తరణ

వాషింగ్టన్‌, నవంబరు 3: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. ఆ కంపెనీలో తనకున్న వాటాలో 300 కోట్ల డాలర్ల (రూ.25,240 కోట్ల) విలువైన 1.6 కోట్ల షేర్లను తాజాగా విక్రయించారు. దీంతో కలిపి ఈ ఏడాది ఆయన విక్రయించిన అమెజాన్‌ షేర్ల విలువ 1300 కోట్ల డాలర్లకుపైనే ఉంటుంది. తాజా అమ్మకంతో జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచ సంపన్నుల (బిలియనీర్ల) జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ఆయన నికర సంపద 22,200 కోట్ల డాలర్లు. 26,200 కోట్ల డాలర్ల సంపదతో తొలిస్థానంలో ఎక్స్‌ యజమాని ఎలాన్‌మాస్క్‌ ఉండగా, మెటా అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌ 20,100 కోట్ల డాలర్లతో మూడోస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెజాన్‌ ఒక్కో షేరు 200 డాలర్లకు దరిదాపుల్లో ఉంది. 1997లో నాస్‌డాక్‌లో (అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లో) నమోదైన తర్వాత కంపెనీ షేరు విలువ ఈ స్థాయిలో పెరగటం ఇదే ప్రథమం. అమెజాన్‌లో బెజోస్‌ 9ు వాటా కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికీ అమెజాన్‌ చైర్మన్‌గా ఉన్న బెజోస్‌.. ఆ కంపెనీలో తన వాటాను ఎందుకు తగ్గించుకుంటున్నారన్న దానిపై స్పష్టత లేదు.

అయితే, అమెజాన్‌ కంపెనీ పలు కొత్త మార్కెట్లకు విస్తరిస్తూ, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. మరోవైపు, బెజోస్‌ కూడా అంతరిక్షంతోపాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. బ్లూ ఆరిజిన్‌ అనే స్పేస్‌ కంపెనీని ప్రారంభించారు.

Updated Date - Nov 04 , 2024 | 02:23 AM