India-America: భారత్‌కు అమెరికా వార్నింగ్.. ఆ ఒప్పందం కుదిరిన గంటల్లోనే..
ABN, Publish Date - May 14 , 2024 | 03:23 PM
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో
భారత్ (India), అమెరికా (America) మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో భారత్‌తో తమ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించింది కూడా! అలాంటి అమెరికా ఇప్పుడు ఓ విషయంలో భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని అంశాల్లో కఠిన ఆంక్షలు తప్పవంటూ హెచ్చరించింది. ఇందుకు కారణం.. చాబహార్ పోర్టు (Chabahar Port) నిర్వహణ విషయంలో ఇరాన్‌తో (Iran) భారత్ ఒప్పందం కుదుర్చుకోవడమే! ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే.. అమెరికా ఆ హెచ్చరికల్ని జారీ చేసింది.
పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు
అమెరికా హెచ్చరిక
అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ (Vedant Patel) మాట్లాడుతూ.. ‘‘చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ.. ఇక్కడొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలుని మేము కొనసాగిస్తూనే ఉంటాం. అలాంటి ఇరాన్‌తో ఏ సంస్థ అయినా, ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే.. వారు కూడా ఆ ఆంక్షల ఛట్రంలో పడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే చాలాసార్లు చెప్పాం’’ అని వెల్లడించారు. తాము హెచ్చరించినా వినిపించుకోకపోతే.. ఆ ఆంక్షల్ని తమని తామే కొనితెచ్చుకున్నట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు. మరి.. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ ప్రాంతాల్లో ఓటు వేయడం తప్పనిసరి.. లేదంటే ఫైన్, కఠిన శిక్షలు
చాబహార్ ఒప్పందం ఏంటి?
మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరపేందుకు ‘చాబహార్ పోర్టు’ ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు. అటు.. అఫ్గానిస్థాన్‌కు భారత్ అందిస్తోన్న ఆహార ధాన్యాలు సైతం ఈ మార్గం ద్వారానే వెళ్తున్నాయి. అందుకే.. చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ పదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో.. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య పెట్టుబడులతో పాటు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
Read Latest International News and Telugu News
Updated Date - May 14 , 2024 | 03:23 PM