ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

America Airlines Flight: ఏకంగా ఫ్లైట్ ల్యాండ్ చేయించారు.. ఏంటంటే..?

ABN, Publish Date - Aug 05 , 2024 | 02:32 PM

కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక విషయం చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. ప్రయాణించే సమయంలో మరీను.. విషయం సరిగా అర్థం కాదు. టూ వీలర్, కారు.. లేదంటే బస్సులో అయితే ఫర్లేదు.. విమానంలో జర్నీ చేసే సమయంలో ఇబ్బంది తప్పదు. అలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఓ చిన్న విషయానికి తెగ హడావిడి చేశారు. ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.

America Airlines Flight Makes Emergency Land

న్యూయార్క్: కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక విషయం చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. ప్రయాణించే సమయంలో మరీను.. విషయం సరిగా అర్థం కాదు. టూ వీలర్, కారు.. లేదంటే బస్సులో అయితే ఫర్లేదు.. విమానంలో జర్నీ చేసే సమయంలో ఇబ్బంది తప్పదు. అలాంటి ఘటన అమెరికాలో (America) జరిగింది. ఓ చిన్న విషయానికి తెగ హడావిడి చేశారు. ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.


ఇది విషయం..

లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్‌కు అమెరికా ఎయిర్ లైన్స్ 2201 విమానం ప్రయాణిస్తోంది. విమానంలో అందరూ సైలంట్‌గా ఉన్నారు. ఇంతలో ఒక్కటే హడావిడి.. విషయం ఏంటంటే.. ఓ మహిళ తల మధ్యలో పేను కనిపించడం. దానిని చూసిన ఓ ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందజేశారు. మహిళా ప్రయాణికురాలి తల గమనిస్తే సరిపోయేది. మహిళలకు పేలు అనేది కామన్. వారు అలా చేయలేదు. అదేదో బగ్ అనుకొని, విమాన సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు కూడా ఏంటి అని ఆరా తీయలేదు. కనీసం నిర్ధారించుకోలేదు. విమానాన్ని ఫినిక్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందుకు కారణం వైద్యం కోసం (మెడికల్ ఎమర్జెన్సీ) అని ప్రకటించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒక్కొ ప్యాసెంజర్ దిగారు. వారికి హోటల్ వొచర్ అందజేశారు. అలా విమానం చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ నెలలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


వీడియో షేర్

విమానంలో జరిగిన ఘటనను ఏతాన్ జెడెల్సన్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా టిక్ టాక్‌లో షేర్ చేశారు. ఉన్నట్టుండి విమానంలో ఏం జరుగుతుందో తెలియలేదని వివరించారు. విమానం దిగిన వెంటనే హోటల్ వొచర్ అందజేశారని పేర్కొన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అవడానికి కారణం మెడికల్ ఎమర్జెన్సీ అని మెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కూడా అమెరికా ఎయిర్ లైన్స్ అధికారిక ప్రకటన చేసింది. ‘జూన్ 15వ తేదీన అమెరికా ఎయిర్ లైన్స్ లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ బయల్దేరింది. వైద్యం కోసం ఫినిక్స్‌లో విమానం దారి మళ్లించాం అని’ ప్రకటన చేసింది. పేలు కోసం విమానం ఆపడంతో గమ్యస్థానానికి 12 గంటల ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Aug 05 , 2024 | 02:32 PM

Advertising
Advertising
<