Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పార్టీ మీటింగ్‌కు సమీపంలో ఏకే-47తో పట్టుబడ్డ వ్యక్తి
ABN, Publish Date - Jul 17 , 2024 | 08:07 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటన కొద్ది రోజులకే మరో అనుమానాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటన కొద్ది రోజులకే మరో అనుమానాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు మిల్వాకీలో పార్టీ ఏర్పాటు చేసిన ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’ జరిగిన ప్రాంతంలో ఓ వ్యక్తి ఏకే-47 గన్‌తో పట్టుబడ్డారు. అతడు స్కీ మాస్క్ (ముఖం అంతా కవర్ చేసేది) ధరించి ఉన్నాడని, ఆ వ్యక్తి వద్ద ఒక వ్యూహాత్మక బ్యాక్‌ప్యాక్ ఉందని, అందులో తుపాకీని భద్రతా బలగాలు గుర్తించాయని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. మందుగుండు నింపిన ఒక మ్యాగజైన్ కూడా బ్యాగులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
సదరు వ్యక్తి వీధిలో స్కీ మాస్క్ ధరించి, వెనుక పెద్ద బ్యాగ్ తగిలించుకొని అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించి అతడిని మిల్వాకీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంకొక ఘటనలో ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’ సెంటర్‌కు సమీపంలోనే కత్తితో గొడవకు దిగిన ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. కాగా సోమవారం జరిగిన ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’కు ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రముఖ నేతలు హాజరయ్యారు.
కాగా పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. కుడి చెవి పైభాగం నుంచి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతడిని తక్షణమే కాల్చిచంపారు.
Updated Date - Jul 17 , 2024 | 08:09 AM