కూల్‌గానే క్రూరత్వం
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:47 AM
హఫెజ్‌తో పోలిస్తే పాలనపై ఏమాత్రం అనుభవం లేని అసద్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో జానాయకుడిగా వ్యవహరించారు.
14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురూ
హఫెజ్‌తో పోలిస్తే పాలనపై ఏమాత్రం అనుభవం లేని అసద్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రజానాయకుడిగా వ్యవహరించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. హఫెజ్ నిరంకుశత్వానికి అల్లాడిపోయిన ప్రజలు అసద్ శైలి చూసి తమకు ఓ మంచి నాయకుడు దొరికాడని భావించారు. క్రమంగా దేశంలో ప్రజాస్వామ్య విధానాల అమలుకు డిమాండ్లు పెరగ్గా, రాజకీయ పార్టీలు కూడా ఏర్పాటయ్యాయి. దీంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అసద్ 2001లో తన అసలు రంగుని బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేకులను కటకటాల్లోకి నెట్టారు. తన తండ్రి లాగే కీలక పదవులను తన భార్య, తమ్ముడు, మరికొందరు సన్నిహితులకు కట్టబెట్టారు.
2010 నాటికి దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. 2011లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలపై అసద్ ఉక్కుపాదం మోపారు. సొంత ప్రజలపై రసాయన దాడులు, బాంబు దాడులు చేయించి ప్రజాఉద్యమాలను అణిచివేశారు. ఈ క్రమంలో 5లక్షల మందికిపై ప్రజల ప్రాణాలు తీశారు. ఇంత చేసినా దేశంలోని చాలా భాగాలు రెబల్స్ అధీనంలోనే ఉండిపోయాయి. 2015లో అధికారాన్ని కోల్పోయే స్థితికి వచ్చిన అసద్.. రష్యా, ఇరాన్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా అండతో ఇన్నాళ్లూ నిలదొక్కుకున్నారు.
Updated Date - Dec 09 , 2024 | 03:49 AM