ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaishankar: ఎస్‌సీఓ సదస్సులో సరిహద్దు తీవ్రవాదంపై పాక్‌కు జైశంకర్ చురకలు

ABN, Publish Date - Oct 16 , 2024 | 09:05 PM

సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.

ఇస్లామాబాద్: సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో జరుగుతున్న షాంఘే సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు దుష్టశక్తులు దేశాల మధ్య సహకారానికి ముప్పుగా పరిణమిస్తాయన్నారు. సహకారం అనేది ఆయా దేశాల మధ్య పరస్పర గౌరవం, సారభౌమత్వం ప్రాతిపదికగా ఉండాలని అన్నారు. సభ్య దేశాలు సమష్టిగా ముందుకు వెళ్తేనే ఇబ్బడిముబ్బడిగా ప్రయోజనాలు చేకూరుతాయని సూచించారు.

Imran Khan: మాజీ ప్రధాని భార్యకు రేప్ బెదిరింపులు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్


"పరస్పర గౌరవం, సార్వభౌమత్య సమానత్యం, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గుర్తించడం పైనే సహకారం అనేది ఆధారపడి ఉంటుంది. వాణిజ్యం, ఎనర్జీ ఫ్లోస్, కనెక్టివిటీ, పీపుల్-పీపుల్ ఎక్స్ఛేంజ్ వంటి వాటికి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటివి అవరోధాలుగా, సవాళ్లుగా నిలుస్తాయి. సహకారానికి పరస్పర విశ్వాసం, మైత్రీసంబంధాలు, మంచి పొరుగుదేశంగా ఉండటం అవసరం. కోవిడ్-19, వాతావరణ మార్పులు, సప్లయ్ చైన్ అనిశ్చితులు, రుణాలు వంటి ఎన్నో ప్రపంచ సవాళ్లు మన ముందున్నాయి. ఏకపక్ష ఎజెండాలు కాకుండా సహజసిద్ధమైన భాగస్వామ్యం అవసరం. సహకారం, సమైక్యత ప్రయోజనాలను ఎస్‌సీఓ దేశాలు గుర్తిచి అందుకు పునరంకితం కావాలి'' అని జైశంకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


Read More International News and Latest Telugu News

Updated Date - Oct 16 , 2024 | 09:05 PM