ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Election 2024: అమెరికా ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉన్నారంటే.. లేటెస్ట్ సర్వే ఇదే

ABN, Publish Date - Nov 04 , 2024 | 06:36 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేశారు. పోలింగ్‌కు మరొక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఈ సర్వేలో మొగ్గు ఎవరివైపు ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Donald trump Kamala Harries

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్ సమయం వచ్చేసింది. మంగళవారం (నవంబర్ 5) దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు ఒక్క రోజు ముందు ఆసక్తికర తాజా సర్వే ఒకటి వెలువడింది. ఫలితాలు ఎటువైపు ఉంటాయో చెప్పలేని ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వైపే మొగ్గు కనిపిస్తోందని ‘అట్లాస్‌ఇంటెల్’ తాజా పోల్ సర్వే పేర్కొంది. మంగళవారం జరగబోయే ఎన్నికల్లో 49 శాతం మంది ఓటర్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని తేలినట్టు సర్వే పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 1.8 శాతం ఓట్ల మేర వెనుకబడే అవకాశం ఉందని విశ్లేషించింది. నవంబర్ నెల తొలి రెండు రోజుల్లో ఈ సర్వే చేపట్టినట్టు ‘అట్లాస్‌ఇంటెల్’ పోల్ పేర్కొంది. మొత్తం 2,500 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించామని, ఇందులో అధికులు మహిళేనని వివరించింది.


కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో అందరి దృష్టి అత్యంత కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాలపైనే ఉంది. స్వింగ్ రాష్ట్రాలుగా పేర్కొనే ఈ ఏడు రాష్ట్రాలు ఎన్నికల్లో విజేతను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ స్వింగ్ రాష్ట్రాలకు సంబంధించి తాజాగా వెలువడిన మరో సర్వే కూడా డొనాల్డ్ ట్రంప్‌నకే మొగ్గు ఉంటుందని పేర్కొంది. ఉదాహరణకు అరిజోనాను తీసుకుంటే ఇక్కడ ట్రంప్‌కు అనుకూలంగా 51.9 శాతం ఓట్లు, కమల హారిస్‌కు 45.1 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని లెక్కగట్టింది.


ఆ రాష్ట్రాలు ఇవే..

స్వింగ్ రాష్ట్రాల జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేన్వియా, విస్కాన్సిన్ ఉన్నాయి. నెవడాలో ట్రంప్ 51.4 శాతం ఓట్లు, హారిస్‌కు 46.8 శాతం, నార్త్ కరోలినాలో ట్రంప్‌కు 50.4 శాతం, హారిస్‌కు 46.8 శాతం ఓట్ల షేర్ పొందుతారని తాజా సర్వే అంచనా వేసింది.


రాష్ట్రాలు మూడు కేటగిరీలుగా విభజన..

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఏడు రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించి రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు.

1980 నుంచి రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంటున్న రాష్ట్రాలను ‘రెడ్ స్టేట్స్’గా, 1992 నుంచి డెమొక్రాటిక్ పార్టీ హవా ఉన్న రాష్ట్రాలను ‘బ్లూ స్టేట్స్’గా పిలుస్తున్నారు. ఈ రెండు కేటగిరీలలోనూ ఫలితాలను అంచనా వేయవచ్చు. అయితే ఫలితాలను ముందుగానే అంచనా వేయలేని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వాటిని స్వింగ్ రాష్ట్రాలుగా పేర్కొంటారు.


కాగా స్వింగ్ రాష్ట్రాల్లో స్వల్ప మెజారిటీతో విజయాలు నమోదవుతుంటాయి. ఉదాహరణగా అరిజోనాను తీసుకుంటే.. గత అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కేవలం 10,000 ఓట్ల తేడాతో ఇక్కడ విజయం సాధించారు. మిగతా రాష్ట్రాల్లో కూడా మార్జిన్ అంత పెద్దగా లేదు.

కాగా అక్టోబర్ 29న రాయిటర్స్/ఐపీఎస్‌వోఎస్ ప్రచురించి పోల్ ప్రకారం.. ఈ స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌కు 43, హారిస్‌కు 44 శాతం ఓట్లు పడవచ్చని అంచనా వేసింది. ఇద్దరి మధ్య అత్యుల్ప తేడా ఉండవచ్చని విశ్లేషించింది.


ఇవి కూడా చదవండి

డొనాల్డ్ ట్రంప్‌పై కమల హారిస్‌దే విజయం

IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..

ఇవాళ ఒక్క రోజే రూ.7.37 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే

జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

For more Sports News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 06:54 PM