ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు.. రాయబార కార్యాలయం అలర్ట్

ABN, Publish Date - May 18 , 2024 | 07:39 PM

కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్‌(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్‌కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kyrgyzstan Attack

కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్‌(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్‌కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల హాస్టళ్లపై పలువురు స్థానికులు దాడి చేసి వారి గదులను ధ్వంసం చేసి, యువతులను కూడా వేధించినట్లు తెలుస్తోంది.


బిష్కెక్‌(Bishkek)లోని పాకిస్థాని వైద్య విద్యార్థి మహ్మద్ అబ్దుల్లా ఈజిప్టు విద్యార్థినులు, కిర్గిజ్‌స్థాన్ ప్రజలను మే 13న వేధించడంతో వివాదం మొదలైందని పలువురు చెబుతున్నారు. ఆ తర్వాత ఈజిప్టు విద్యార్థులు స్థానిక విద్యార్థులతో ఘర్షణ పడటంతో అల్లర్లు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారని పాకిస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోలో తెలిపాడు.

తుపాకులు, కర్రలతో దాడికి పాల్పడ్డారని అన్నాడు. ఈ క్రమంలో బిష్కెక్‌లో ముగ్గురు ఈజిప్టు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కిర్గిజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం విదేశీ విద్యార్థులపై దాడిలో కనీసం 29 మంది గాయపడగా, వారిలో 15 మంది వివిధ ఆసుపత్రులలో చేరినట్లు తెలుస్తోంది.


ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం(India Embassy) అప్రమత్తమైంది. భారతీయ విద్యార్థులు గదుల లోపలే ఉండాలని సూచించింది. ఈ క్రమంలో స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్(S. Jaishankar) ఇండియన్ ఎంబసీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. మేము మా విద్యార్థులతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ క్రమంలో 0555710041కు ఫోన్ చేయాలని సూచించారు.


ఇది కూడా చదవండి:

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest International News and Telugu News

Updated Date - May 18 , 2024 | 07:42 PM

Advertising
Advertising