ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

King Charles: కింగ్ చార్లెస్‌కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:32 PM

‘‘మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి!. మా దగ్గర దొంగిలించి ఇవ్వండి!. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’’ అంటూ కింగ్ చార్లెస్ ముందు ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ఫ్ నినాదాలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు.

King Charless

కాన్‌బెర్రా: కింగ్ చార్లెస్‌కు ఆస్ట్రేలియాలో ఘోర పరాభవం ఎదురైంది. సోమవారం ఆయన ఆస్ట్రేలియా పార్లమెంటు సందర్శన వెళ్లగా లిడియా థోర్ప్ అనే సెనేటర్ వలసపాలన వ్యతిరేక నినాదాలు చేశారు. ‘‘మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి!. మా దగ్గర దొంగిలించినవి ఇవ్వండి!. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’’ అంటూ ఆమె నినాదాలు చేశారు. చార్లెస్ ప్రసంగం ముగిసిన తర్వాత సెనేటర్ లిడియా థోర్ప్ ఈ నినాదాలు చేశారు. బిగ్గరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనూహ్యమైన ఈ పరిణామంతో మిగతా చట్ట సభ్యులు, ఇతర రాజకీయ నాయకులు షాక్‌కు గురయ్యారు.


ఆదిమ ఆస్ట్రేలియన్ జాతీకి చెందిన లిడియా థోర్ప్ స్వతంత్ర సెనేటర్‌గా విజయం సాధించారు. రాచరిక విధానానికి వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపిస్తుంటారు. యూరోపియన్ సెటిలర్ల చేతుల్లో ఆదిమ ఆస్ట్రేలియన్లు మారణహోమానికి గురయ్యారని ఆమె చెబుతుంటారు.

అయితే 2022లో సెనేటర్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా దేశాధినేతగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-IIకి సేవ చేస్తానంటూ ఆమె ప్రమాణం చేయడం గమనార్హం. ఆ సమయంలో ఆమె తన కుడి పిడికిలిని పైకి లేపి చూపించారు. క్వీన్ మీద ప్రమాణం చేసేందుకు ఆమె నిరాకరించినప్పటికీ సెనేట్ అధికారి ఒత్తిడి చేయడంతోనే తోర్ప్ ఈ ప్రమాణాన్ని చదివారు. ‘‘సెనేటర్ థోర్ప్, సెనేటర్ థోర్ప్.. కార్డుపై ముద్రించిన ప్రమాణాన్ని మీరు చదవాలి’’ అని ఛాంబర్ ప్రెసిడెంట్ మందలింపు చేయడంతో ఆమె స్పందించి ప్రమాణస్వీకారం చేశారు.


కాగా ఆస్ట్రేలియా 100 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ సమయంలో ఎంతో మంది ఆదిమ ఆస్ట్రేలియన్లు హత్యకు గురయ్యారు. చాలా మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. బ్రిటిష్ పాలన నుంచి ఆస్ట్రేలియా 1901లో స్వాతంత్య్రాన్ని పొందింది. కానీ ఇప్పటివరకు సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా మాత్రం అవతరించలేదు. దేశాధినేతగా కింగ్ చార్లెస్ ఇంకా కొనసాగుతున్నారు.


కాగా కింగ్ చార్లెస్ ప్రస్తుతం 9 రోజుల విహార యాత్రలో ఉన్నాడు. ఆస్ట్రేలియా, సమోవా దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి

బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన కడియం

పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. ఎందుకంటే

For more Viral News and Telugu News

Updated Date - Oct 21 , 2024 | 03:41 PM