బాణసంచాపై నిషేధంలో మత కోణం లేదు: కేజ్రీవాల్
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:40 AM
దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించడంలో హిందూ-ముస్లిం కోణం లేదని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నివారించేందుకే నిషేధం విధించినట్లు చెప్పారు.
ఢిల్లీ, అక్టోబరు 30: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించడంలో హిందూ-ముస్లిం కోణం లేదని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నివారించేందుకే నిషేధం విధించినట్లు చెప్పారు. దీపావళి పండుగ వెలుగుల పండుగ అని కాలుష్యం వెదజల్లేది కాదన్నారు. చిన్నారులతో సహా అందరినీ కాలుష్యం నుంచి కాపాడేందుకే బాణాసంచాపై నిషేధం విధించామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా నిషేధాన్ని సమర్థించాయని కేజ్రీవాల్ చెప్పారు. 2025 జనవరి 1వరకు బాణసంచా తయారీ, అమ్మకం, కాల్చడం, నిల్వ ఉంచడంపై ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది.
Updated Date - Oct 31 , 2024 | 05:40 AM