ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh violence: ప్రధానిగా ప్రొ. మహమ్మద్ యూనస్

ABN, Publish Date - Aug 08 , 2024 | 02:11 PM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ప్రొ. మహమ్మద్ యూనస్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 15 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని సమాచారం. దేశ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఢాకా, ఆగస్ట్ 08: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ప్రొ. మహమ్మద్ యూనస్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 15 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని సమాచారం. దేశ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Also Read: wayanad landslide: వయనాడ్‌కు ప్రధాని మోదీ..!


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణ కోసం విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. ఆ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అవి విఫలమయ్యాయి. ఆ కొద్ది రోజులకే దేశ ప్రధాని హసీనా.. తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలైయ్యాయి. దీంతో వందలాది మంది మరణించారు.

Also Read: Bangladesh Violence: భారతీయ వీసా సెంటర్లు క్లోజ్.. యూరప్‌కు హసీనా

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


అలాగే వేలాది మంది గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం తన సోదరి రేహనాతో కలిసి షేక్ హసీనా పొరుగునున్న భారత్‌కు చేరుకుని తల దాచుకున్నారు. అనంతరం ఆమె లండన్‌ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించ లేదు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను యూరప్‌కు పంపేందుకు భారత్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ చర్చ అయితే వైరల్ అవుతుంది.

Also Read: LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు

Also Read: Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..


మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం రద్దు కావడంతో.. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశాధ్యక్షుడు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో రాజకీయా పార్టీలతోపాటు విద్యార్థి సంఘాలతో చర్చించారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బ్యాంకర్ ప్రొ. మహమ్మద్ యూనస్ పేరును విద్యార్థి సంఘాల కో ఆర్డినేటర్ నదీమ్ ఇస్లాం ప్రతిపాదించారు. దీంతో గురువారం బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read:Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’


మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం రద్దు కావడంతో.. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశాధ్యక్షుడు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో రాజకీయా పార్టీలతోపాటు విద్యార్థి సంఘాలతో చర్చించారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బ్యాంకర్ ప్రొ. మహమ్మద్ యూనస్ పేరును విద్యార్థి సంఘాల కో ఆర్డినేటర్ నదీమ్ ఇస్లాం ప్రతిపాదించారు. దీంతో గురువారం బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంకోవైపు బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు అప్పుడే నెలకొనేలా లేవు. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లోనున్న భారతీయ వీసా జారీ కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. అవి ఎప్పుడు తెరుస్తారనే విషయాన్ని సందేశం రూపంలో తెలియ జేస్తామని ప్రకటించారు.

Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 02:11 PM

Advertising
Advertising
<