ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh: హిందువులకు కమాపణ చెప్పిన బంగ్లాదేశ్ హోం మంత్రి

ABN, Publish Date - Aug 12 , 2024 | 05:16 PM

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోవడంపై ఆ దేశ హోం మంత్రి షెకావత్ హుస్సేన్ క్షమాపణ చెప్పారు. హిందూ మైనారిటీని రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందని అన్నారు.

ఢాకా: బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండలో హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోవడంపై ఆ దేశ హోం మంత్రి షెకావత్ హుస్సేన్ (Sakhawat Hossain) క్షమాపణ చెప్పారు. హిందూ మైనారిటీని రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందని అన్నారు. మునుముందు హిందువుల భద్రతకు, పరిస్థితులను మెరుగుపరచేందుకు తాము భరోసాగా నిలుస్తామని చెప్పారు.


హసీనా పార్టీపై నిషేధం యోచన లేదు...

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలోకి ఉన్న మధ్యంతర ప్రభుత్వానికి షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధించే ఆలోచన ఏదీ లేదని షెకావత్ తెలిపారు. బంగ్లాదేశ్‌కు ఆ పార్టీ ఎంతో చేసిందని, ఆ విషయాన్ని తాము గుర్తించామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు.

Shashi Tharoor: షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు


పోలీసు సమ్మె విరమణ

కాగా, పలు డిమాండ్లపై సమ్మెకు దిగిన బంగ్లా పోలీసులు ఎట్టకేలకు సమ్మె ఉపసంహరణకు అంగీకరించారు. తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల అడ్వయిజర్ హుస్సేన్‌తో ఆదివారంనాడు సమావేశమైన అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు. 11 డిమాండ్లలో మెజారిటీ డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో నిరసనలకు దిగిన నాన్-క్యాడర్ పోలీసు అధికారులు సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నారు.

Updated Date - Aug 12 , 2024 | 05:20 PM

Advertising
Advertising
<