ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హాసీనాపై మరో హత్య కేసు నమోదు

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:43 PM

షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్‌పై బంగ్లాదేశ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 4వ తేదీ.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా టీచర్ హుస్సేన్ ఆ ఆందోళనలో పాల్గొన్నారు.

ఢాకా, ఆగస్ట్ 16: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసీనాపై మరో హత్య కేసు నమోదయింది. షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్‌పై బంగ్లాదేశ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 4వ తేదీ.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా టీచర్ హుస్సేన్ ఆ ఆందోళనలో పాల్గొన్నారు.

ఆ క్రమంలో వందలాది మంది అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు.. ఆ ఆందోళకారులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో టీచర్ హుస్సేన్ మరణించారు. అవామీ లీగ్ అధినేత షేక్ హసీనాతోపాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ ఆదేశాలతోనే హుస్సేన్‌పై దాడి చేసి హత్య చేశారంటూ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు.. షేక్ హసీనాతోపాటు ఖాదర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read: Jammu Kashmir: ఎన్నికల ప్రకటనకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు


షేక్ హాసీనాపై తొలి హత్య కేసు నమోదు..

మరోవైపు గత వారం బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాపై తొలిసారిగా హత్య కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదు చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. దేశంలో రిజర్వేషన్ల సంస్కరణల కోసం విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు పిలుపునిచ్చారు.

దీనికి ప్రజల నుంచి మద్దతు సైతం లభించింది. ఆ క్రమంలో జులై 19న మొహమ్మద్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు. దీనిపై అతడి స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు


హాసీనాతోపాటు ఆరుగురిపై కేసు నమోదు..

షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్, హోమ్ శాఖ మాజీ మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ ఐజీ చౌదరి అబ్దుల్ అల్ మమున్‌లతోపాటు పోలీస్ శాఖలో అత్యున్నత అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్లు మీడియాలో వార్త కథనాలు అయితే వెలువడ్డాయి.

Also Read:Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?


రాజీనామా చేయక తప్పని పరిస్థితి.. మొత్తం 560 మంది మృతి

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం.. అనంతరం ప్రధాని పదవికి షేక్ హాసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం ఆందోళన బాట పట్టింది. అది హింసాత్మకంగా మారింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం పొరుగునున్న భారత్‌కు సోదరి రెహానాతో కలిసి వచ్చి.. తలదాచుకున్నారు.

Also Read: Kolkata Medical student murder: ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట వైద్యుల ‘ఆరు డిమాండ్లు’


భారత్‌లోనే ఉండిపోయిన షేక్ హాసిీనా..

అనంతరం ఆమె బ్రిటన్ వెళ్లాలని భావించినా.. ఆ దేశ నిబంధనల ప్రకారం అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో షేక్ హాసీనా భారత్‌లోనే ఉండి పోయారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రొ.యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం కోలువు తీరింది. ఇక బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 560 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 05:49 PM

Advertising
Advertising
<