Israel vs Hamas: విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని
ABN, Publish Date - Apr 08 , 2024 | 06:46 AM
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ (Israel-Hamas War) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ (Gaza War) ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని (Hamas) అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ఈ యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచిన తరుణంలో.. ఆ ప్రతిజ్ఞనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మరోసారి పునరుద్ఘాటించారు. గాజా యుద్ధంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా ఎలాంటి సంధి ఉండదని తేల్చి చెప్పారు.
Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం
ఏప్రిల్ 7వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘గాజా యుద్ధంలో మేము విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. కానీ.. మనం చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, హృదయ విదారకమైంది’’ అని అన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తులతో కైరోలో సంధి చర్చలు పునఃప్రారంభమవుతాయని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘హమాస్ చెరలో ఉన్న బందీలు తిరిగి వచ్చేదాకా కాల్పుల విరమణ ఉండదు’’ అని బదులిచ్చారు. ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది కానీ, లొంగిపోవడానికి మాత్రం సిద్ధంగా లేదని నొక్కి చెప్పారు. కాల్పుల విరమణపై అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై చేస్తున్న ఒత్తిడికి బదులు.. హమాస్‌కి వ్యతిరేకంగా గొంతెత్తాలని పిలుపునిచ్చారు. అప్పుడు బందీల విడుదల మరింత వేగవంతం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
UK Evil Monster: మానవ రాక్షసుడు.. భార్యని చంపి, బాడీని 224 ముక్కలుగా నరికి..
కాగా.. ఏప్రిల్ 1వ తేదీన గాజాలో జరిపిన వైమానిక దాడిలో యూఎస్ ఆధారిత ‘ఫుడ్ ఛారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్’కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోవడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ ఘటన జరిగిన వెంటనే నెతన్యాహుకి ఫోన్ చేసి, తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. అయితే.. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని నెతన్యాహు ఆరోపణలు చేశారు. తమని ఎవరైతే బాధపెడతారో, వాళ్లని దెబ్బతీస్తామని పేర్కొన్నారు. ఈ సూత్రాన్ని తాము అన్ని సమయాల్లో ఆచరణలో పెట్టామని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 06:46 AM