Viral: వీళ్లేం మనుషులురా బాబు.. పుస్తకాలు కొనుక్కోమంటే.. ఫుల్‌గా బిర్యానీలు లాంగిచేశారుగా..
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:51 AM
పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్‌కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్‌లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ..
బుక్స్ ఫెయిర్ అంటే చాలు పుస్తక ప్రియులంతా ఒక దగ్గరకు చేరిపోతారు. తమకు కావాల్సిన పుస్తకాలను కొనుక్కుంటారు. కానీ పాకిస్తాన్‌లో మాత్రం బక్ ఫెయిర్‌ను ఫుడ్ ఫెయిర్‌గా మార్చేశారు అక్కడి ప్రజలు. పుస్తక ప్రదర్శనలో లక్షలాది పుస్తకాలను పెట్టినా.. కేవలం 35 పుస్తాకాలు మాత్రమే అమ్ముడయ్యాయట. అదేంటి బుక్ ఫెయిర్‌కు జనం రాలేదా అంటే అదీ కాదు.. జనం బాగానే వచ్చారు.. కానీ పుస్తకాల కొనుగోలు కంటే బక్ ఫెయిర్‌లో తినడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ప్రజలకు పుస్తకాలకంటే తిండిపై ఎక్కువ ధ్యాస ఉందంటూ కొందరు నెటిజన్లు ఈ పోస్టుపై కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెనుకబాటుకు ఇదే కారణమంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుస్తాకల ప్రదర్శనను ఫుడ్ ఎగ్జిబిషన్‌గా మార్చేయడం వైరల్ అవుతోంది.
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..
పుస్తకాలపై ఆసక్తి చూపని జనం..
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పుస్తకాల ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఇక్కడి బుక్ ఫెయిర్ లో పుస్తకాల పట్ల జనం ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమైంది. ఇక్కడి ప్రజలు తినడం, తాగడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. లాహోర్ బుక్ ఫెయిర్‌లో కేవలం 35 పుస్తకాలు మాత్రమే అమ్ముడడంపై నిర్వహకులు విస్తుపోయారు. బిర్యానీలు మాత్రం 800లకు పైగా ప్లేట్లు అమ్ముడుపోయాయి. పాకిస్థాన్‌లో ఈ పుస్తక ప్రదర్శనపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన లాహోర్‌లో ఇటీవల పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తక ప్రదర్శనలో లక్షల పుస్తకాలు ఉన్నాయి. అయినప్పటికీ 35 పుస్తకాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్‌లో పుస్తక ప్రదర్శనలకు ఏమాత్రం ఆదరణ లభించడం లేదనే విషయం స్పష్టమవుతోంది.
1200కు పైగా షావర్మాలు..
బుక్ ఫెయిర్‌కు వచ్చిన పాకిస్థానీలు పుస్తకాలపై ఎలాంటి ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో తినే, తాగే విషయంలో మాత్రం వెనుకాడలేదు. పుస్తకాలకు బదులు తినుబండారాలు లాగించేయడానికి అక్కడి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బుక్‌ఫెయిర్‌లో మొత్తం 35 పుస్తకాలు సేల్ కాగా.. 200కి పైగా షావర్మాలు, 800 ప్లేట్ల బిర్యానీలు అమ్ముడుపోయాయి. పుస్తక ప్రదర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆహారం కోసం మాత్రమే వచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
YS Jagan:అమ్మ, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?
సాహిత్య కేంద్రం లాహోర్
లాహోర్ పాకిస్థాన్‌లో రెండవ అతిపెద్ద నగరం. ఈ చారిత్రక నగరం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. సాదత్ హసన్ మాం, ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఈ నగరంలోనే జన్మించారు. లాహోర్‌ను పాకిస్తాన్ సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా పిలుస్తారు. అలాంటి లాహోర్‌లో జరుగుతున్న బుక్ ఫెయిర్‌కు ఇలాంటి దుస్థితి ఏర్పడటంపై సాహితీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bus Accident: ఘోరం.. 30అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..
నెటిజన్ల రియాక్షన్..
సామాజిక మాద్యమం రెడిట్‌లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. పాకిస్తానీలు మంచి సాహిత్య ప్రియులేనని అయితే పుస్తకాలు కొనకపోవడానికి ధర ఓ కారణమని తెలిపారు. ఒక ప్లేట్ బిర్యానీ రూ.400 నుంచి 500 లేదా అంతకంటే తక్కువ ధరకే లభిస్తుందని, ఒక నవల రూ.1000 నుంచి రూ.4000 వరకు ఉంటుందని మరో నెటిజన్ స్పందించాడు. తమకు పుస్తకం కావాలంటే సెకండ్ హ్యాండ్ బుక్‌షాప్‌కి వెళ్లడానికి ఇష్టపడతామని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 23 , 2024 | 11:51 AM