ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Boeing Layoffs: 17 వేల మంది ఉద్యోగులకు షాక్.. బోయింగ్ విమాన సంస్థ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Nov 14 , 2024 | 08:02 PM

దిగ్గజ విమానసంస్థలో లేఆఫ్ ల పర్వం మొదలైంది. సంస్థ నిర్ణయంతో భారీగా 17 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.

Boeing

అమెరికాకు చెందిన దిగ్గజ విమాయాన సంస్థ బోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10శాతంగా ఉన్న 17,000 ఉద్యోగాలను తగ్గించే ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఈ వారంలో కార్మికులకు లేఆఫ్ నోటీసులను పంపడం ప్రారంభిస్తామని బోయింగ్ బుధవారం ప్రకటించింది. భారీగా నష్టాల్లో కూరుకుపోయిన ఈ ఏరో స్పేస్ దిగ్గజం ఈ సంవత్సరం మరిన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక నష్టాలను పూడ్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.


నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులు అమల్లోకి రావడానికి ముందు కంపెనీలకు 60 రోజుల పాటు నోటీస్ పీరియడ్ లో పనిచేయాల్సి ఉంటుంది. లేఆఫ్స్ అందుకున్న ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నెల వరకు బోయింగ్ పేరోల్‌లోనే ఉండనున్నారు. ముందు ప్రకటించినట్టుగానే ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలుపెడుతున్నాం. ఈ విషయంలో కంపెనీ ఉద్యోగుల మద్దతు మాకు ఉంటుందని ఆశిస్తున్నాం అని బోయింగ్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.


ఇటీవల బోయింగ్ సంస్థకు చెందిన 33 వేల మంది ఉద్యోగులు సియోటెల్ ప్రాంతంలో సమ్మెకు దిగారు. కొన్న వారాలపాటు ఈ సమ్మె కొనసాగింది. ఈ కారణంతో కంపెనీ 727 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల తయారీని నిలిపివేయవలసి వచ్చింది. వర్కర్ల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో బోయింగ్ సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టాలను పూడ్చుకునే పనిలో లేఆఫ్ లను ప్రకటించింది.

Rajasthan: ఎన్నికల అధికారిని చెప్పుతో కొట్టిన అభ్యర్థి అరెస్టు.. ఆ నియోజకవర్గంలో గందరగోళం..


Updated Date - Nov 14 , 2024 | 08:04 PM