ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Boycott Netflix: కొత్త చిక్కుల్లో నెట్‌ఫ్లిక్స్.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల పిలుపు.. కారణం ఇదే!

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:12 PM

ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్ అందించే ‘నెట్‌ఫ్లిక్స్’ ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. దీనిని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో..

Boycott Netflix

ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్ అందించే ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో #BoycottNetflix అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయినా ఇప్పుడు ఆ సంస్థకు ఈ నిరసన సెగ తగలడానికి కారణమేంటి? అని అనుకుంటున్నారా! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ (Reed Hastings) జోక్యం చేసుకోవడమే! డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న కమలా హారిస్‌కు (Kamala Harris) ఆయన భారీ విరాళం ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఆయన సుమారు 7 మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చాడని సమాచారం. ఓ రాజకీయ ప్రచారానికి హేస్టింగ్స్ ఇంత పెత్త మొత్తం ఇవ్వడం ఇదే మొదటిసారి!


విరాళమే కొంపముంచింది

ఓ సందర్భంలో కమలా హారిస్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నిరాశకు గురి చేసిన డిబేట్ తర్వాత మేము తిరిగి గేమ్‌లోకి వచ్చాం’’ అని రీడ్ హేస్టింగ్స్ పేర్కొన్నాడు. అంతేకాదు.. అధ్యక్ష బరిలో నిల్చున్న ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు గెలిచే సమయం ఆసన్నమైందని కూడా పేర్కొన్నాడు. అదే సమయంలో.. విరాళం కూడా ఇచ్చిన అంశం తెరమీదకు రావడంతో, డొనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ‘బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. తమని తాము MAGA (Make America Great Again) ఫ్యాన్‌బేస్‌గా చెప్పుకునే ట్రంప్ మద్దతుదారులు.. నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేసి, కమలా హారిస్‌కు ఆయన ఇస్తున్న మద్దతుకు గాను తగిన ప్రతిఫలం అందించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. తాము నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ని క్యాన్సిల్ చేశామంటూ చాలామంది స్క్రీన్‌షాట్స్‌ తీసి, వాటిని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో ట్విస్టు

ఇదిలావుండగా.. గత కొన్ని నెలల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఈ ఎన్నికల పోరు ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీగా సాగింది. అయితే.. ఆరోగ్య సమస్యలు, డిబేట్‌లో తడబాట్లు వంటి కారణాల వల్ల బైడెన్‌కు సొంత వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరిగాయి. దీంతో.. మరోదారి లేక ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత ట్రంప్‌కు మద్దతు విపరీతంగా పెరిగిపోయింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:12 PM

Advertising
Advertising
<