ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్.. కెనడా ప్లానేంటి?

ABN, Publish Date - May 12 , 2024 | 10:04 AM

ఖ‌లిస్తానీ ఉగ్రవాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో మరో భారతీయుడిని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం ఇదే కేసులో అనుమానితులుగా భావించిన ముగ్గురు భార‌తీయులను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ: ఖ‌లిస్తానీ ఉగ్రవాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో మరో భారతీయుడిని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం ఇదే కేసులో అనుమానితులుగా భావించిన ముగ్గురు భార‌తీయులను అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా శనివారం అమన్‌దీప్‌ సింగ్‌ అనే 22 ఏళ్లు యువకుడిని అరెస్టు చేసిన‌ట్లు రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) వెల్లడించారు. బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్‌ ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఇన్‌చార్జి మన్‌దీప్‌ మూకర్‌ వెల్లడించారు. నిజ్జర్‌ను 2023, జూన్ 18న కెన‌డాలోని స‌ర్రేలో ఉన్న గురుద్వారా వ‌ద్ద హ‌త్య చేశారు


వారిని అదుపులోకి తీసుకున్నారిలా..

నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను మే3న కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒక స్వ్కాడ్‌గా ఏర్పడి హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) నిందితుల పేర్లను వెల్లడించారు.భారత్‌కు చెందిన కరణ్ ప్రీత్ సింగ్(28), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ బ్రర్(22) ఉన్నారు. వారిని దర్యాప్తు సంస్థలు కొన్ని నెలల క్రితమే గుర్తించాయి. పకడ్బందీ ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నాయి.

ఆర్సీఎంపీ సూపరింటెండెంట్ మన్దీప్ మూకర్ మాట్లాడుతూ.. "నిందితులకు భారత ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం" అని అన్నారు. నిజ్జర్ హత్య కోసం వీరిలో ఒకరు షూటర్‌గా, ఇంకొకరు డ్రైవర్‌గా, మరొకరు స్పాటర్‌గా వ్యవహరించి ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రావిన్సులలో విస్తృతంగా తనిఖీ చేపట్టాక నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కేసు దర్యాప్తు కోసం అమెరికా లా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలతో కలిసి పని చేసినట్లు కెనెడియన్ పోలీసులు తెలిపారు. నిజ్జర్ హత్యపై ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. దీని వెనక భారత్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో.. దానికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొనడంతో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Read Latest News and National News here..

Updated Date - May 12 , 2024 | 10:05 AM

Advertising
Advertising