ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada PM Trudeau:భారత్‌‌తో పెట్టుకుంటే అంతేమరీ.. కెనడా ప్రధాని పదవికి ముప్పు..

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:07 PM

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై స్వపక్షంలోనే అసంతృప్తి బయటపడింది. ట్రూడఓ రాజీనామా చేయాలంటూ 24మంది లిబరల్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన అంతర్గత సమావేశంలో ప్రధాని వైఖరిపై స్వపక్ష సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో..

Justin Trudeau

భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన కెనడా ప్రధాని పదవికే ముప్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత్, కెనడా మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని, కెనడా అనవసరంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటుందన్న వాదన వినిపించింది. మరోవైపు ఖలీస్థానీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఏజెంట్లు పనిచేస్తున్నారని, వారికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయని కెనడా ఆరోపించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఓవైపు కొనసాగుతుండగా.. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై స్వపక్షంలోనే అసంతృప్తి బయటపడింది. ట్రూడఓ రాజీనామా చేయాలంటూ 24మంది లిబరల్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన అంతర్గత సమావేశంలో ప్రధాని వైఖరిపై స్వపక్ష సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోవడానికి ప్రధాని ట్రూడో వైఖరే కారణమంటూ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారట.ఈ విషయాన్ని ట్రూడో సన్నిహితుడు, ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ వెల్లడించారు. ట్రూడో వైఖరిపై కొందరు సభ్యులు అసంతృప్తిగా ఉన్న విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఈ విషయంపై చర్చ జరుగుతోందని, దీనిని బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ఎంపీలు నిజాయితీగా ప్రధానికి వెల్లడించారన్నారు. ఆయనకు వినడం ఇష్టం ఉన్నా.. లేకపోయినా సభ్యులు చెప్పాల్సింది చెప్పారన్నారు.


24మంది సంతకాలు..

ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 28లోపు రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ట్రూడో ప్రభుత్వానికి స్వపక్షంలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం సవాలుగా మారనుంది. జూన్‌, సెప్టెంబర్‌ ఎన్నికల్లో లిబరల్స్‌ బలమైన రెండు స్థానాలను కోల్పోవడంతో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీ సన్నాహాలు కూడా దారుణంగా ఉన్నాయని ఎంపీలు అభిప్రాయపడ్డారు. పార్టీ ఎంపీ ఎరిస్కిన్‌ స్మిత్‌ మాట్లాడుతూ పరిస్థితులను చక్కదిద్దడానికి ట్రూడోకు ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. మీ సహచరులు అసంతృప్తి వ్యక్తంచేసినప్పుడు దానిని వినడం చాలా ముఖ్యమన్నారు.


బలంగా ఉన్నామంటూ..

ప్రధాని ట్రూడో మాత్రం తన పదవికి ముప్పు పొంచి ఉందని తెలిసినా పైకి తమకు అవసరమైన బలం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాము బలంగా, సమష్టిగా ఉన్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు తానే నాయకత్వం వహిస్తానని వెల్లడించారు. చాలాకాలం లిబరల్స్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన ఎన్‌డీపీ కూడా ఈసారి బ్రిటిష్‌ కొలంబియా ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతింది. అక్కడ కన్జర్వేటీవ్‌ పార్టీ ఊహించని స్థాయిలో బలపడింది. ఇటీవల నానోస్‌ రీసెర్చి సర్వేలో అక్టోబర్‌ 15 నాటికి ప్రజల్లో 39శాతం మద్దతు కన్జర్వేటీవ్‌లకు ఉండగా.. లిబరల్స్‌కు కేవలం 23శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. ఇక న్యూడెమోక్రాట్స్‌కు 21శాతం మంది సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 24 , 2024 | 12:07 PM